టాలీవుడ్ లో చాలా మంది హీరోలు ప్రయోగాలు చెయ్యాలి అంటే ఒకటికి పది సార్లు ఆలోచించే పరిస్థితి ఉంటుంది అనేది వాస్తవం. టాలీవుడ్ అగ్ర హీరోలు కొందరు ప్రయోగాలు చేసే వాళ్ళు కూడా వెనకడుగు వేసారు. అగ్ర హీరోలతో ప్రయోగాలు చెయ్యాలని దర్శక నిర్మాతలు కూడా ఎన్నో ప్రయత్నాలు చేసినా సరే హీరోలు మాత్రం భయపడుతూ చేయడానికి ఆసక్తి చూపించే వారు కాదు. అయితే రామ్ చరణ్ మాత్రం ఆ విషయంలో ఎక్కడా భయపడే వాడు కాదు. తన కెరీర్ లో రామ్ చరణ్ ప్రయోగాలు చేయడానికే ఎక్కువగా ఆసక్తి చూపించాడు. 

 

ముందు మగధీర సినిమాతో రామ్ చరణ్ ప్రయోగం చేసాడు. ఆ తర్వాత ఆ సినిమా సూపర్ హిట్ అవ్వడంతో ఆరెంజ్ సినిమాలో ప్రయోగం చేయగా ఆ సినిమా ఫ్లాప్ అయింది. ఇక అక్కడి నుంచి రామ్ చరణ్ కెరీర్ ఊపందుకుంది. అతను కెరీర్ పీక్ స్టేజి లో ఉన్న సమయంలో సుకుమార్ తో ఒక ప్రయోగం చేసాడు. రంగస్థలం అనే సినిమా ద్వారా రామ్ చరణ్ చేసిన ప్రయోగం టాలీవుడ్ లో ఒక సంచలనం. ఈ సినిమాలో రామ్ చరణ్ నటనకు అభిమానులు ఫిదా అయిపోయారు. ఆ విధంగా ఆ సినిమా ఎంతగానో ఆకట్టుకుంది ప్రేక్షకులను. 

 

అతను కొన్ని సన్నివేశాల్లో నటించిన తీరుకి టాలీవుడ్ విమర్శకులు కూడా ప్రసంశల వర్షం కురిపించారు. ప్రతీ సన్నివేశం లో అతను దాదాపుగా జీవించాడు. సమంతా తో అతను చేసిన కొన్ని ప్రేమ సన్నివేశాలు, పల్లెటూరి అబ్బాయి మాదిరిగా గోదావరి యాస అతను మాట్లాడిన తీరు అన్నీ కూడా సూపర్ హిట్. ఇక జగపతి బాబు సీనియర్ నటుడు అయినా సరే ఆయన పక్కన ఏ మాత్రం భయపడకుండా రామ్ చరణ్ నటించాడు. ఈ సినిమా అతని కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచింది.

మరింత సమాచారం తెలుసుకోండి: