ప్రముఖ దర్శక దిగ్గజం ఎస్ ఎస్ రాజమౌళి ప్రస్తుతం యంగ్ టైగర్ ఎన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ హీరోలుగా తెరకెక్కిస్తున్న తాజా సినిమా రౌద్రం రణం రుధిరం ఫస్ట్ లుక్ మోషన్ పోస్టర్ ఇటీవల రిలీజ్ అయి ప్రేక్షకుల నుండి మంచి స్పందనను రాబట్టిన విషయం తెలిసిందే. రామ్ చరణ్ అల్లూరి సీతారామరాజుగా నటిస్తున్న ఈ సినిమాలో ఎన్టీఆర్ కొమరం భీం గా నటిస్తున్నారు. డివివి ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ పై డివివి దానయ్య అత్యంత భారీ ఖర్చుతో తెరకెక్కిస్తున్న ఈ సినిమాలో అలియా భట్, ఒలీవియా మోరిస్ హీరోయిన్లుగా నటిస్తుండగా అజయ్ దేవగన్, సముద్ర ఖని, రాహుల్ రామకృష్ణ సహా మరికొందరు హాలీవుడ్ నటులు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. 

 

శరవేగంగా షూటింగ్ జరుపుకుంటున్న ఈ సినిమాకు మిగతా సినిమాల మాదిరిగా ఇటీవల కరోనా ఎఫెక్ట్ తో కొంత బ్రేక్ పడింది. ప్రస్తుతం సినిమాకు సంబంధించి మిగతా కార్యక్రమాల పై దృష్టిపెట్టిన యూనిట్, ఎలాగైనా అనుకున్న విధంగా సినిమాని వచ్చే ఏడాది సంక్రాంతికి రిలీజ్ చేసేలా గట్టిగా ప్లాన్స్ చేస్తున్నారట. ఇకపోతే నేడు మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టిన రోజు కావడంతో ఆయనకు బహుమతిగా ఈ సినిమాలో మరొక హీరో అయిన ఎన్టీఆర్ ఒక స్పెషల్ సర్ప్రైజ్ ని ఇవ్వడానికి సిద్దమై, నిన్న తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఒక ప్రకటన చేసారు. 

 

రేపు ఉదయం యూట్యూబ్ లో సరిగ్గా పదిగంటలకు నీకు నేను ఇచ్చే సర్ప్రైజ్ అదిరిపోతుంది, తప్పకుండా ఇది నీ లైఫ్ లో ఎప్పటికీ గుర్తుండిపోతుంది అంటూ చరణ్ ని ఉద్దేశించి ఎన్టీఆర్ ఒక పోస్ట్ చేసారు. నేను కూడా దాని కోసం ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నాను మిత్రమా అంటూ చరణ్ దానికి రిప్లై ఇవ్వడం జరిగింది. ఇక ఆ సర్ప్రైజ్ ఏమై ఉంటుందా అని అందరూ నేటి ఉదయం 10 గంటలకు యూట్యూబ్ ముందు రెడీ అవ్వగా, సడన్ గా ఎన్టీఆర్, సారీ చరణ్ నీకు పంపవలసిన గిఫ్ట్ ని నిన్న రాత్రి జక్కన్న రాజమౌళికి పంపాను, నీకు తెలుసుకదా జక్కన్న అంటేనే లేట్ అని అంటూ పోస్ట్ చేయగా, అదేంటి నువ్వు జక్కన్నకు పంపావా, అసలు నా గిఫ్ట్ ఈరోజు నాకు అందుతుందా లేదా అంటూ చరణ్ దానిని రీట్వీట్ చేయడం జరిగింది. ప్రస్తుతం ఈ ఇద్దరు హీరోల సరదా ట్వీట్స్ పలు మీడియా మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి....!!  

మరింత సమాచారం తెలుసుకోండి: