జనాన్ని తన యాక్టింగ్ తో, డాన్స్ తో  ఆకట్టుకుంటాడు మన మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ . తండ్రికి తగ్గ తనయుడు అని ఎన్నో సార్లు ప్రూవ్ చేసుకున్నాడు ఈ ట్యాలెంటెడ్ హీరో . చిరుత సినిమాతో పరిచయం అయినా ఈ స్టార్  ఆరెంజ్, రచ్చ, నాయక్, తుఫాన్, ఎవడు, గోవిందుడు అందరివాడే, బ్రూస్ లీ, ధ్రువ, రంగస్థలం, వినయ విధేయ రామ ఇలా అనేక సినిమాలలో నటించి ప్రేక్షకులని మెప్పిస్తున్నాడు .

 

IHG

 

ఇలా అనేక సినిమాల్లో నటించిన రామ్  చరణ్ పాత్రలు చెప్పుకో దగ్గవి. రంగస్థలం రామ్ చరణ్ సినిమాల్లో బాగా స్పెషల్. చరణ్ చెమిటి వాడిలా నటించి ప్రేక్షకులని ఆకట్టుకున్నాడు . మంచి హిట్టు కూడా చెర్రీకి సొంతం అయ్యింది. రామ్ చరణ్ నటించిన పలు సినిమాలకి అవార్డులు కూడా వచ్చాయి .

 

 

విజేత ఫిలింఫేర్ దక్షిణాది పురస్కారం- ఉత్తమ నూతన నటుడుగ రామ్ చరణ్ కి చిరుత సినిమాతో వచ్చింది. ఆ సినిమాకే విజేత, నంది ప్రత్యేక పురస్కారం కూడా రావడం విశేషం.రంగస్థలం సినిమాకి రెండో సారి ఫిలిం ఫేర్ అవార్డు వచ్చింది చెర్రీకి . 

 

IHG

 

 

ఇలా మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పలు సినిమాలకి గాను అవార్డులు దక్కించుకున్నాడు. ఇప్పుడు సారి కొత్తగా చెర్రీ ఆర్.ఆర్.ఆర్ సినిమాతో రాబోతున్నాడు. ఈ సినిమాకి దర్శకత్వం రాజమౌళి అందిస్తున్నాడు. యంగ్ టైగర్ ఎన్టీఆర్ తో కలిసి చరణ్ రావడం విశేషమే . 

 

మరింత సమాచారం తెలుసుకోండి: