మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ ఈరోజు తన 35వ పుట్టినరోజు ను జరుపుకుంటున్నాడు. అయితే ప్రస్తుతం తన కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు, వీరాభిమానులు, అభిమానులు రామ్ చరణ్ కి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలపడంతో పాటు చాలామంది అతని ని గిఫ్ట్ లతో ముంచెత్తుతున్నారు. దర్శక దిగ్గజం రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఆర్ఆర్ఆర్ చిత్రంలో యంగ్ టైగర్ ఎన్టీఆర్, రామ్ చరణ్ హీరోగా నటిస్తున్న సంగతి తెలిసిందే. అయితే తన కో యాక్టర్ అయిన రామ్ చరణ్ పుట్టినరోజు జరుపుకుంటున్న వేళ జూనియర్ ఎన్టీఆర్ ఒక ఆసక్తికరమైన ట్వీట్ చేసారు. ఆ ట్వీట్ కి రామ్ చరణ్ కూడా స్పందించాడు. అయితే వీళ్లిద్దరి ట్వీట్స్ లలో రాజమౌళి గురించి ఓ హాస్యాస్పదమైన విషయం బయటపడింది. 

 

 

పూర్తి వివరాలు తెలుసుకుంటే... రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా జూనియర్ ఎన్టీఆర్ తన కో యాక్టర్ కోసం ఒక బహుమతిని కొన్నారట. అయితే నిన్న రాత్రి ఆ గిఫ్ట్ ని ఎస్ ఎస్ రాజమౌళి కి పంపించి ఎలాగుందో చెప్పాల్సిందిగా తాను అడిగాడట. ఐతే రామ్ చరణ్ పుట్టిన రోజు ప్రారంభమైన చాలా సేపటి తర్వాత కూడా రాజమౌళిగిఫ్ట్ ని జూనియర్ ఎన్టీఆర్ కి తిరిగి పంపించ లేదట. ఈ విషయాన్ని సాక్షాత్తూ తారక్ ట్వీట్ చేస్తూ 'రాజమౌళి కదా! గిఫ్ట్ తిరిగి ఇచ్చేసరికి కాస్త లేట్ అవుతుంది' అంటూ చెప్పడం ప్రస్తుతం నెట్టింట హాట్ టాపిక్ గా మారింది. ఈ ట్వీట్ ని చదివిన చెర్రీ 'ఏంటీ! నువ్వు అతనికి పంపించావా? ఈరోజు నాకు అందుతుందా ఆ గిఫ్ట్!?', అంటూ జూ. ఎన్టీఆర్ కి రిప్లయ్ ఇచ్చాడు రామ్ చరణ్. 

 

 

 


మరి వీళ్లిద్దరి ట్వీట్స్ కి రాజమౌళి ఎలా స్పందిస్తారో చూడాలిక. ఇకపోతే ఇటీవల ఆర్ఆర్ఆర్ సినిమాకు సంబంధించిన ఓ మోషన్ పోస్టర్ విడుదలయ్యి ఇంటర్నెట్ లో సునామి సృష్టించిన సంగతి తెలిసిందే. దీన్ని బట్టి చూస్తే ఈ సినిమా పై తెలుగు అభిమానులకు ఏ రేంజ్ లో అంచనాలు ఉన్నాయో తెలుస్తుంది.

మరింత సమాచారం తెలుసుకోండి: