తెలుగు సినిమాల్లోకి వ్యక్తిగా వచ్చి తక్కువ కాలంలోనే ఇండస్ట్రీని శాసించే మెగాస్టార్ అయిపోయాడు చిరంజీవి. నెంబర్ వన్ హీరోగా మూడు దశాబ్దాలకు పైగా తెలుగు సినిమాను ఏలుతున్నాడాయన. అలాంటి స్థాయి హీరో నుంచి వచ్చే వారసుడిపై ఎలాంటి అంచనాలుంటాయో చెప్పక్కర లేదు. చిరంజీవి కొడుకు అనే టన్నుల బరువును మోసిన రామ్ చరణ్ ఆ బరువు దింపేసుకోవడానికి ఎక్కువ సమయం తీసుకోలేదు. తొలి సినిమా చిరుతతో హిట్ కొట్టిన చరణ్ రెండో సినిమా మగధీరతో ప్రభంజనమే సృష్టించాడు.

 

 

2009లో రాజకీయంగా చిరంజీవి తీవ్ర గడ్డు పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. అటు పవన్ కల్యాణ్ సిరీస్ ఆఫ్ ఫ్లాప్స్ లో ఉన్నాడు. చిరంజీవి అభిమానులం అని గర్వంగా చెప్పుకునే మెగా అభిమానులు సైలంట్ అయిపోయారు. ఆ టైమ్ లో మగధీరగా వచ్చిన రామ్ చరణ్ తండ్రికి తగ్గ తనయుడని అనిపించుకున్నాడు. ఆ సినిమా సాధించిన హిట్ గురించి కథలు కథలుగా చెప్పుకున్నారు. మగధీరకు కలెక్షన్స్ రావడం చూసి ఈ ప్రభంజనం ఎప్పుడు ఆగుతుందో అని ఇండస్ట్రీనే ఆశ్చర్యపోయేలా చేసింది. ఇండస్ట్రీ గమనాన్నే మార్చేసిన హిట్ అది. మెగాభిమానులు గర్వంగా కాలర్ ఎగరేసిన సందర్భ అది. తండ్రికి తగ్గ తనయుడని ఊగిపోయారు.

 

 

టాలీవుడ్ కి 100కోట్ల క్లబ్ ను తొలిసారి రుచి చూపించింది చరణే. చిరంజీవి కొడుకు నుంచి చరణ్ తండ్రి చిరంజీవిగా మార్చేశాడు. మెగాస్టార్ చిరంజీవికి తగ్గ అసలు సిసలు వారసుడిగా టాలీవుడ్ లో స్థిరపడిపోయాడు. ఓ సూపర్ స్టార్ కొడుకు అదే స్టార్ స్టేటస్ మెయింటైన్ చేయగలడని నిరూపించాడు. తొలి సినిమా చిరుతతో ఓ డెబ్యూ హీరో సాధించిన రికార్డును ఈ 11 ఏళ్లలో మరెవరూ సాధించలేదు. రంగస్థలంలో తన అద్భుత నటనతో నాన్ బాహుబలి ఇండస్ట్రీ హిట్ కొట్టాడు. మెగాభిమానుల ఆశాదీపంలా మారిపోయాడు.  

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: