తండ్రి ఉనికిని పునికిపుచ్చుకుని  త‌న‌కంటూ ఓ ప్ర‌త్యేక గుర్తింపు తెచ్చుకుని ఇండ‌స్ట్రీ కి హిట్ల‌ను మెగా హిట్లు ఇవ్వ‌డం వ‌ల‌న‌. మెగాస్టార్‌లోని మెగాని ప‌వ‌ర్‌స్టార్‌లోని ప‌వ‌ర్ ని త‌ను క‌ష్ట‌ప‌డి సాధించిన స్టార్ ఇమేజ్‌లోని స్టార్‌ని ఒక్క‌టి చేసి ప‌వ‌ర్‌స్టార్‌గా ఎదిగి త‌న స్టార్ ఇమేజ్‌ను  ప‌క్క‌న పెట్టి రంగ‌స్థ‌లం వంటి చిత్రంలో న‌టించి తెలుగు సినిమా స్థాయిని పెంచిన రామ్‌చ‌ర‌ణ్‌తేజ్ 1985 మార్చి 27న కొణిదెల చిరంజివి, సురేఖ‌ల దంప‌తుల‌కు చెన్నైలో జ‌న్మించాడు రామ్‌చ‌ర‌ణ్‌తేజ్‌. రామ్‌చ‌ర‌ణ్ మెకానిక‌ల్ ఇంజ‌నీర్ అవ్వాల‌ని ఆయ‌న కోరిక కానీ చిరంజీవి త‌న‌కు ఉన్న ఇమేజ్‌తో త‌మ్ముడిని, మేన‌ల్లుడిని ఎలాగైతే హ‌రోల‌ని చేశాడో అలాగే చెయ్యాల‌ని ఆయ‌న‌కి కోరిక ఉండేది. ఇక నెమ్మ‌దిగా సినిమాల మీద చ‌ర‌ణ్‌కి ఇంట్ర‌స్ట్ క‌లిగేలా కె. రాఘ‌వేంద్ర‌రావుగారి లాంటి ద‌ర్శ‌కుల‌ని ఇంటికి పిలిపించి చ‌ర‌ణ్‌తో మాట్లాడ‌మ‌నేవారు త‌న‌కు ఇంట్ర‌స్ట్ క‌లిగేలా చెయ్య‌మ‌నేవారు అలా అంద‌రూ చెప్ప‌డంతో ఎంతో క్రేజ్ ఉన్న ఇంత మంచి ప‌రిశ్ర‌మ‌ని వ‌దిలేసి ఎక్క‌డికో వెళ్ళ‌డం దేనిక‌ని ఓ రోజు నాన్న నేను యాక్టింగ్ నేర్చుకుంటా అంటూ చిరుతో చెప్పారు. వెంట‌నే ఆయ‌న లండ‌న్ పంపించి ఓ ఇన్‌స్టిట్యూట్‌లో జాయిన్ చేశారు. చిరంజీవి ముందు రాజ‌మౌళితో చ‌ర‌ణ్ సినిమా చెయ్యాల‌నుకున్నాడు. 

 

కానీ రాజ‌మౌళి చ‌ర‌ణ్ యాక్టింగ్ స్కిల్స్ తెలియ‌కుండా సినిమా తియ్య‌లేను అని చెప్పేశారు. నేను మొద‌టి సినిమా చెయ్య‌లేను అంటూ భ‌య‌ప‌డ్డారు. ఇక అలా మొద‌టి సినిమా పూరి ద‌ర్శ‌క‌త్వంలో చిరుత చిత్రం వ‌చ్చింది. నిర్మాత‌గా అశ్విని ద‌త్ అయితే శుభ‌సూచ‌కం అని ఆయ‌న‌కి ప్రొడ్యూస‌ర్‌గా అవ‌కాశ‌మిచ్చారు. ఇక ఈ సినిమా అవ్వ‌గానే రాజ‌మౌళి ఇచ్చిన మాట ప్ర‌కారం మ‌గ‌ధీర క‌థ‌ను సిద్ధం చేసుకుని చ‌ర‌ణ్ తో చేశారు. ఆ చిత్రం రికార్డు స్థాయిలో హిట్ అయింది. ఆ త‌ర్వాత కృష్ణ వంశీ సీతారామ‌య్య‌గారి మ‌న‌వ‌రాలు చిత్రం ఇన్‌స్పిరేష‌న్‌గా తీసుకుని చేశారు. అలా గోవిందుడు అంద‌రికి వాడు చిత్రం అనేక మ‌లుపులు తిరిగి తెర‌కెక్కింది కాని ఆశించినంత ఫ‌లితం రాలేదు. ఆ త‌ర్వాత సుకుమార్‌తో రంగ‌స్థ‌లం సుకుమార్ చాలా డిఫ‌రెంట్‌గా చూపించారు. గోదావ‌రి అంటే ప‌చ్చ‌ద‌నం చూపించేవారు. కానీ సుకుమార్ మాత్రం బంగార‌పు ఛాయ చూపించారు. ఇక ఈ చిత్రం నాన్ బాహుబ‌లి రికార్డుల‌ని తుడిచి పెట్టింది. త‌ర్వాత బ్రూస్‌లీ చేసి ఇలాంటి సినిమా ఎలా చేశారు అన్న విమ‌ర్శ‌ల‌ను ఎదుర్కొన్నారు. ఇక చ‌ర‌ణ్ కెరియ‌ర్ మొత్తంలో రెండు హిట్లు ఒక ఫ్లాప్‌గా నాలుగు సార్లు రిపీట్ అయింది. కేవ‌లం ఆయ‌న మూడు ఫ్లాప్‌లు తొమ్మిది హిట్లు ఉన్న హీరో ఆయ‌న మాత్ర‌మే అని చెప్ప‌వ‌చ్చు. చ‌ర‌ణ్‌కి ఉపాస‌న‌తో వివాహం జ‌రిగిన విష‌యం తెలిసిందే. 

 

జ‌క్క‌న్న రాజ‌మౌళి తెర‌కెక్కిస్తున్న ఆర్‌.ఆర్‌.ఆర్‌. చిత్ర విశేషాల‌లో ఇద్ద‌రు పోరాట యోధుల చ‌రిత్ర‌ను తెర‌పై ఆవిష్క‌రిస్తున్న విష‌యం తెలిసిందే. అందులో ఒక‌రు తెలంగాణ పోరు బిడ్డ కొమ‌రం భీమ్ కాగా రెండో వ్య‌క్తి  ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో స్వాతంత్య్ర ఉద్య‌మ కాలంలో బ్రిటీష‌ర్ల‌ను ఎదిరించిన మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజు. వీరి చ‌రిత్ర‌ను జ‌క్క‌న్న తెర పై ఆవిష్క‌రించ‌బోతున్నారు. ప్ర‌పంచానికి తెలుగు వీరుల చ‌రిత్ర ఇది అని ఆయ‌న చాట‌బోతున్నారు. ఇంత‌కీ ఈ వీరులెవ‌రు వీరి చ‌రిత్ర ఏమిటి రాజ‌మౌళి వీరు టేక‌ప్ చేసేంత క్య‌రియాసిటీ ఈ వీరుల చ‌రిత్ర‌లో ఏముంద‌న్న‌ది అంద‌రిలోనూ ఆశ‌క్తి రేపుతున్నాది. మ‌న్యం వీరుడు అల్లూరి సీతారామ‌రాజుగా చ‌ర‌ణ్ ఇందులో క‌నిపించ‌బోతున్న‌ట్లు స‌మాచారం.  మ‌రి ఈ చిత్రంలో ఆయ‌న ఏ స్థాయిలో మెప్పిస్థారో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: