తల్లిదండ్రులు తమ పిల్లల గురించి ఎప్పుడు మాట్లాడినా భావోద్వేగానికి గురవుతూ ఉంటారు. వాళ్ళు మెగాస్టార్లయినా సూపర్ స్టార్లయినా పిల్లల విషయంలో మాత్రం వాళ్ళు మామూలు సాదాసీదా వ్యక్తులే. ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి కూడా అదే భావోద్వేగానికి గురవుతున్నాడు. తన కుమారుడు రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా చెర్రీ చిన్నప్పటి ఫొటో సోషల్ మీడియాలలో షేర్ చేసి శుభాకాంక్షలు తెలియజేసాడు. ఈ ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి గెటప్ చూస్తుంటే క్లాసిక్ డేస్ లో షూటింగ్ లొకేషన్ లోని ఫోటో అని అర్థమవుతోంది. ఈ ఫొటోలో రామ్ చరణ్ చాలా క్యూట్ గా ఉన్నాడు. బోసి నవ్వులు నవ్వుటూ డాడీతో మురిపెంగా ఆటలాడుకుంటున్నాడు. ఈ ఫోటో ఇప్పుడు సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది. ఈ మధ్యే సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన చిరంజీవి వచ్చీ రావడంతోనే పోస్టులతో హోరెత్తిస్తున్నాడు.

 

ఈ సందర్భంగా చిరు పెట్టిన ఈ ఫోటో చూసిన మెగా అభిమానుల సంతోషానికి అంతులేకుండా పోయింది. తమ అభిమాన హీరోల ఓల్డ్ ఫొటోస్ చూస్తూ ఆనందపడిపోతున్నారు. యముడికి మొగుడు, దొంగ మొగుడు, మంచి దొంగ చిత్రాల సమయంలో చిరంజీవి గెట్ అప్ లా అనిపిస్తోంది. మెగాస్టార్ ఫ్యామిలీకి ఇచ్చే ఇంపార్టెన్స్ తెలియంది కాదు. ఖాళీ లేకుండా సంవత్సరం పొడవునా షూటింగులతో బిజీగా ఉన్న సమయంలో కూడా ఫ్యామిలీతో టైం స్పెండ్ చేసేవాడు. ఫ్యామిలీ లైఫ్ ని మాత్రం అస్సలు విడిచిపెట్టలేదు. దీనికి ఇప్పుడు పెట్టిన ఫొటో ఒక ఉదాహరణ. షూటింగ్ గ్యాప్ లో ఖాళీ సమయాన్ని ఇలా తనయుడు రామ్ చరణ్ తో స్పెండ్ చేశారు. ఓ వైపు షూటింగ్ లో శ్వేధం చిందిస్తూనే ఇలా కొంత సమయాన్ని గడిపే అవకాశం తనకు కలిగిందన్నమాట. అందుకే ఆయన ఫ్యామిలీస్ మెచ్చే మెగాస్టార్ అయ్యారు. నేడు రామ్ చరణ్ బర్త్ డే సందర్బంగా చిరు ఈ చిరు కానుకను ఫ్యాన్స్ కి అందించారు. ఇప్పటికే రామ్ చరణ్ పిలుపు మేరకు పుట్టిన రోజు వేడుకలకు దూరంగా ఉన్న మెగా అభిమానులకు మెగాస్టార్ అందించిన ఈ చిరు కానుక కొంత ఊరట కలిగిస్తున్నదని చెప్పవచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: