అంతకుముందు వరకూ పెద్దగా పట్టించుకోని బాలీవుడ్  ఇప్పుడు పనికట్లుకుని సౌత్ సినిమాలను రీమేక్ చేస్తోంది.  ఈ రీమేక్ లు హిందీలో కూడా వర్కవుట్ అవుతుండడంతో కంప్లీట్ గా ఇక్కడి సినిమాలమీదే కాన్సన్ ట్రేట్ చేస్తున్నారు టాప్ హీరోలు, ప్రొడ్యూసర్లు, డైరెక్టర్లు. అలా రీసెంట్ గా తెలుగులో హిట్ అయ్యిన భీష్మ సినిమాని కూడా రీమేక్ చెయ్యడానికి రెడీ అయ్యాడు స్టార్ హీరో రణబీర్. నితిన్, రష్మిక జంటగా రీసెంట్ గా రిలీజ్ అయ్యి సూపర్ హిట్ అయిన సినిమా భీష్మ. వెంకీ కుడుముల డైరెక్షన్ లో వచ్చిన ఈసినిమా మంచి సక్సెస్ అందుకుంది. అందుకే ఈ సినిమా మీద బాలీవుడ్ కన్నేసింది. 

 

కరణ్ జోహార్ .. ఇప్పటికే  డియర్ కామ్రడ్ సినిమా రైట్స్ ని సినిమా చూడకముందే కొనేశాడు. భీష్మ తో పాటు డియర్ కామ్రేడ్ కూడా రీమేక్ కి రెడీ గా ఉంది. అంత కంటే ముందే అల్లు అర్జున్ కి అదరిపోయే హిట్ ఇచ్చిన అలవైకుంటపురంలో  సినిమా మీద కూడా బాలీవుడ్ స్టార్ హీరో కన్ను పడింది. సూపర్ సక్సెస్ అయిన ఈ సినిమాను సల్మాన్ ఖాన్ రీమేక్ చేద్దామన్నప్లాన్ లో ఉన్నాడట. నార్త్ నేటివిటీకి తగ్గట్లు ఇంకాస్త గ్రాండియర్ ను యాడ్ చేసి తెరకెక్కించేలా ప్లాన్ చేస్తున్నాడట సల్మాన్ ఖాన్.

 

బాలీవుడ్ యాక్షన్ కింగ్  కూడా సౌత్ సినిమాల మీద ఇంట్రస్ట్ చూపిస్తున్నాడు . తమిళ్ లో సూపర్ హిట్ అయిన కాంచన ను రీమేక్ చేస్తున్నాడు . లారెన్స్ యాక్ట్ చేసి డైరెక్ట్ చేసిన ఈ కాంచన  సినిమాని హిందీలో లక్ష్మీబాంబ్ గా  బాలీవుడ్ లో కి తీసుకొస్తున్నాడు. అక్షయ్ కు జంటగా ఈ సినిమాలో కియారా అద్వానీ నటిస్తోంది. 

 

తెలుగులో అనుష్క  లీడ్ రోల్ లో వచ్చి న బాగమతి సినిమా కూడా హిందీలో రీమేక్అవుతోంది.  స్వీటీ తనలోని యాక్టింగ్ వేరియేషన్స్ అన్నీ చూపించిన ఈ సినిమా సూపర్ హిట్ అయ్యింది. ఇప్పుడు ఈ సినిమాని హిందీలో  దుర్గావతి గా రీమేక్ చేస్తున్నారు. భూమి పెడ్నేకర్ లీడ్ రోల్ లో అక్షయ్ కుమార్ ప్రజెంట్ చేస్తున్న ఈ సినిమా ని అశోక్ డైరెక్ట్ చేస్తున్నాడు 

 

మరో యంగ్ హీరో సిద్దార్ద్ మల్మోత్ర కూడా సౌత్ సినిమా రీమేక్ చేస్తున్నాడు . తమిళ్ లో సూపర్ హిట్ అయిన తడమ్ సినిమా ను హిందీలో రీమేక్ చేస్తున్నాడు . కెరీర్ లో పెద్దగా హిట్స్ లేని సిద్దార్ద్ ఈ యాక్షన్ త్రల్లర్ లో తో సక్సెస్ అందుకోవాలని చూస్తున్నాడు . ఈ సినిమాలో సిద్దార్ద్ డ్యూయల్ రోల్ లో డిఫరెంట్ షేడ్స్ చూపించబోతున్నాడు.

మరింత సమాచారం తెలుసుకోండి: