దేశంలో కరోనా వైరస్ కలకలం రేపుతోంది. కరోనా ఎఫెక్ట్ దేశ ఆర్థిక వ్యవస్థ పైన బాగానే పడుతుంది. తారాలోకం మేము సైతం అంటూ ముందుకు కదిలి వచ్చింది. ఈ కరోనా మహమ్మారి నుండి దేశ ప్రజల ప్రాణాలు పోకూడని తమ వంతు సాయం వారు చేస్తున్నారు. ఏపీ, తెలంగాణ ప్రజల బాగోగుల కోసం తమ వంతు కొంత ఆర్థిక సహాయాన్ని కరోనా విరాళంగా ప్రభుత్వాలకు ఇస్తున్నారు. క‌రోనా వైర‌స్‌ నిర్మూల‌న‌కు కేంద్ర‌, రాష్ట్ర ప్ర‌భుత్వాలు యుద్ధ ప్ర‌తిపాదిక‌న చ‌ర్య‌లు చేప‌డుతున్నాయి. 

 

తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు వచ్చినా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సాయం చేయడానికి ఎప్పుడూ ముందే ఉంటుంది. హీరోలు దర్శక నిర్మాతలు తమ వంతుగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తుంది. ఈ నేపథ్యంలో 21 రోజులు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ విధిస్తున్నట్లు ప్రధాని మోడీ ప్రకటించిన విషయం తెలిసిందే. 

 

అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది. దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. అయితే వారిని ఆదుకోవడానికి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు పలు ప్యాకేజీలను ప్రకటించడం జరిగింది. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనాపై పోరాటానికి నాంది పలికిన తెలుగు సినిమా హీరో నితిన్ తో మొదలైన ఆర్థిక సాయం ఇప్పుడు ఊపందుకుంది. 

 

తాజాగా కరోనా వైరస్ నిర్మూలనకు ప్రముఖ దర్శకుడు సుకుమార్ రూ. 10 ల‌క్ష‌ల విరాళాన్ని ప్ర‌క‌టించారు. రెండు తెలుగు రాష్ట్రాల ముఖ్య‌మంత్రుల స‌హాయ నిధికి చెరో రూ.5 ల‌క్ష‌లు చొప్పున విరాళం అందజేస్తానని ఆయన తెలిపారు. ఈ విరాళాలను ప్రభుత్వాలకు త్వరలోనే అందజేయనున్నట్లు ఆయన తెలిపారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: