సిల్వర్ స్క్రీన్ మీద ఆడియన్స్ని ఎంటర్ టైన్ చేసే హీరోల గురించి ప్రతి విషయం తెలుసుకోవాలని ఈగర్ గా వెయిట్ చేస్తుంటారు ఫ్యాన్స్. అందుకే తమ అభిమాన హీరోలను సోషల్ మీడియాలో ఫాలో అవుతూ ఉంటారు. రీసెంట్ గా మెగా స్టార్ కూడా తమ అభిమానులతో డైరెక్ట్ గా అన్ని విషయాలు షేర్ చేసుకోవడానికి ఫరెవర్ యువర్స్ అంటూ సోషల్ మీడియాలో అడుగుపెట్టాడు. అలా ఎంటరయ్యాడో లేదో.. ఈ మెగా హీరో కి ఫాలోయింగ్ కూడా అదే రేంజ్ లో పెరిగిపోయింది.
చిరంజీవికే కాదు..సీనియర్ స్టార్లందరికీ మెగా ఫాలోయింగ్ బాగానే ఉంది. సౌత్ లో తమిళ్ సూపర్ స్టార్ రజనీకాంత్ కు మంచి ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది సోషల్ మీడియాలో. రజనీకాంత్ కు ట్విట్టర్ లో దాదాపు 57లక్షల మందికి పైగా ఫాలోవర్స్ ఉన్నారు. సోషల్, ఇంట్రస్టింగ్ న్యూస్ కి తప్ప ప్రమోషన్స్ కి పెద్దగా ఇంపార్టెన్స్ ఇవ్వడు తలైవా. సోషల్ మీడియాలో కూడా ఇవే విషయాలు పోస్ట్ చేస్తూ ఉంటాడు.
తమిళ్ లో ఉన్న మరో స్టార్ కమల్ హాసన్ కి కూడా సోషల్ మీడియాలో ఫ్యాన్ ఫాలోయింగ్ గట్టిగానే ఉంది. ట్విట్టర్ లో దాదాపు 58 లక్షల పైగా ఫాలోవర్స్ ఉంటే .. క్రేజీ సోషల్ యాప్ ఇన్ స్టాగ్రామ్ లో కూడా ట్విట్టర్ లానే.. దాదాపు అదే స్థాయిలో ఫాలోయింగ్ సొంత చేసుకున్నాడు ఈ లోకనాయకుడు.
అసలుఫాలోయింగ్ అంటే .. అమితాబ్ ది. బాలీవుడ్ లివింగ్ లెజెండ్ .. అమేజింగ్ యాక్టర్ .. అమితాబ్ బచ్చన్ .. ని స్టార్లు సైతం ఫాలో అవుతూ ఉంటారు. అందుకే ఆయన ఫాలోయింగ్ నెంబర్ పెద్దదే ఉంటుంది. ట్విట్టర్ లో అమితాబ్ ని దాదాపు 4 కోట్ల 60 లక్షల మందికి పైగా ఫ్యాన్స్ ఉంటే.. ఇన్ స్టాగ్రామ్ లో కోటి 46 లక్షల మంది ఫ్యాన్ ఫాలోయింగ్ ను సంపాదించుకున్నాడు బిగ్ బీ.
బాలీవుడ్ లో బిగ్ బీ ని రీచ్ అయ్యే లెవల్లో ఫాలోవర్స్ ఉన్న మరో స్టార్ షారూఖ్ ఖాన్. ఈ రొమాంటిక్ హీరో ని ట్విట్టర్ లో 4 కోట్ల మందికి పైగా ఫాలో అవుతుంటే.. ఇన్ స్టాగ్రామ్ లో మాత్రం 2 కోట్ల 70 లక్షల మంది ఫాలోవర్స్ ఉన్నారు. ఇన్ స్టాగ్రామ్ లో ఎప్పటికప్పుడు ఇంట్రస్టింగ్ కంటెంట్ ని పోస్ట్ చేసే షారూఖ్ కు లేడీ ఫ్యాన్ ఫాలోయింగ్ చాలా ఎక్కువ. వీళ్లతో పాటు ... స్టార్ హీరోలందరూ ఎప్పటికప్పుడు తమ పర్సనల్ ప్రొఫెషనల్ విషయాలు షేర్ చేసుకుంటూ ఫ్యాన్ఫాలోయింగ్ ని పెంచుకుంటున్నారు.
అంతేకాదు కొంత మంది స్టార్లు తమ సినిమాల ప్రమోషన్ కోసమే కాదు బ్రాండింగ్లకు కూడా సోషల్ మీడియా ఎకౌంట్ లను వాడుతూ దాని ద్వారా కూడా గట్టిగానే సంపాదిస్తున్నారు. ముఖ్యంగా హీరోయిన్లు ఇన్నర్వేర్ నుంచి మొబైల్ ఫోన్ల వరకు ప్రతీ దాన్ని తమ సోషల్ మీడియా పేజ్లో ప్రమోట్ చేస్తూ సోమ్ము చేసుకుంటున్నారు.
#HappySarvariUgadi
— chiranjeevi konidela (@KChiruTweets) March 25, 2020
DELIGHTED to directly engage with my beloved fellow indians,Telugus & my dearest fans through a platform like this.This #NewYear’s Day,let’s resolve to defeat this global health crisis with awareness & responsibility. #UnitedAgainstCorona #StayHomeStaySafe pic.twitter.com/Fb3Cnw4nHH