మెగా ఫ్యామిలీ నుండి మరో హీరో వైష్ణవ్ తేజ్ ఎంట్రీ ఇస్తున్నాడు. తన మొదటి సినిమా ఉప్పెన ఏప్రిల్ 2 రిలీజ్ డేట్ ప్రకటించారు. అయితే ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమాలు అన్ని వాయిదా పడిన విషయం తెలిసిందే. మైత్రి మూవీ  మేకర్స్, సుకుమార్ కలిసి నిర్మిస్తున్న ఈ సినిమాలో వైష్ణవ్ తేజ్ సరసన కృతి శెట్టి హీరోయిన్ గా నటించింది. సినిమాను సుకుమార్ అసిస్టెంట్ బుచ్చిబాబు డైరెక్ట్ చేస్తున్నారు. దేవి శ్రీ ప్రసాద్ మ్యూజిక్ అందించిన ఈ సినిమాలోని రెండు సాంగ్స్ రిలీజై మంచి బజ్ ఏర్పరచుకున్నాయి, అయితే సుకుమార్ నిర్మాతగా పేరు వేసుకోవడమే తప్ప డబ్బులు పెట్టింది ఏమి లేదని టాక్. 

 

అంతేకాదు మొదటి సినిమానే అయినా వైష్ణవ్ తేజ్ సినిమాకు 20 కోట్ల దాకా ఖర్చు పెట్టారట. అంటే ఇప్పుడు బిజినెస్ దానికి మరో రెండు మూడు కోట్లు ఎక్కువ కావాల్సి ఉంది. అయితే డిస్ట్రిబ్యూటర్స్ అంత పెట్టి కొనడం కష్టమని భావించి నిర్మాతలే ఈ సినిమాను సొంతంగా రిలీజ్ చేద్దామని అనుకుంటున్నారు. శ్రీమంతుడు, జనతా గ్యారేజ్, రంగస్థలం లాంటి సూపర్ సెన్సేషనల్ హిట్ అందించిన మైత్రి మేకర్స్ ఈసారి మెగా హీరో విషయంలో రిస్క్ చేస్తూ సొంతంగా రిలీజ్ చేస్తున్నారు. 

 

అసలు మొదటి సినిమా కాబట్టి వైష్ణవ్ తేజ్ మీద అంట బడ్జెట్ పెట్టడమే పొరపాటు. ఇప్పుడు డిస్ట్రిబ్యూటర్స్ ఎవరు సినిమా కొనేందుకు సిద్ధంగా లేరని నిర్మాతలే రిలీజ్ చేసేందుకు రెడీ అవుతున్నారు. కంటెంట్ బాగుంటే కచ్చితంగా మైత్రి వారికి మంచి లాభాలు తెచ్చే ఆకాశం ఉంది. ఏది ఏమైనా ముందు బడ్జెట్ విచ్చలవిడిగా పెట్టడం ఎందుకు ఆ తర్వాత ఇలా కష్టాలు పడటం ఎందుకని అంటున్నారు సినీ విశ్లేషకులు. మెగా మేనళ్లుడు సాయి తేజ్ తన కెరియర్ సెట్ చేసుకోగా వైష్ణవ్ తేజ్ కూడా హీరోగా అలరిస్తాడో లేదో చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: