కరోనా ప్రభావంతో సామాన్యులతో పాటు సెలబ్రిటీలు కూడా ఇళ్లకే పరిమితమవుతున్నారు. అయితే తమ అభిమాన నటులు ఇళ్లలోనే ఉంటూ సరదా వీడియోలను షేర్ చేస్తుండటంతో ఫ్యాన్స్‌ కూడా సెలబ్రిటీలకు సంబంధించి ఫన్నీ మీమ్స్‌ ను షేర్ చేస్తున్నారు. తాజాగా ఓ అభిమాని బహుభాషా నటుడు మాధవన్‌కు సంబంధించి ఓ ఇంట్రస్టింగ్ పోస్ట్ సోషల్ మీడియాలో వైరల్‌ గా మారింది.

 

అంతేకాదు ఈ పోస్ట్ పై స్వయంగా మాధవన్‌ కూడా స్పందించటం విశేషం. మాధవన్‌ లవర్‌ బాయ్‌ లుక్‌ లో ఉన్న స్టిల్‌తో పాటు రాకెట్రీ సినిమాలోని ఆయన ఓల్డ్‌ లుక్‌కు సంబంధించిన ఫోటోలను ట్విటర్‌ లో పోస్ట్ చేశాడు. ఈ ఫోటోలతో పాటు డే 1లో,  డే 21 న అంటూ కామెంట్ చేశాడు. ఈ పోస్ట్‌ను మాధవన్‌ కు ట్యాగ్ చేయటంతో ఆయన కూడా స్పందించాడు.

 

ఆ పోస్ట్ ను రీ ట్వీట్ చేస్తూ `నేను అంగీకరిస్తాను. దేశం మరియు మానజాతి హితం కోసం అలా మారినా కూడా నేను అంగీకరిస్తాను` అంటూ రిప్లై ఇచ్చాడు మాధవన్‌. ప్రస్తుతం అనుష్క ప్రధాన పాత్రలో తెరకెక్కిన నిశ్శబ్దం సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నాడు మాధవన్.

 

పలువురు హాలీవుడ్ తారలు కూడా ఇలాంటి పోస్ట్ లు చేస్తున్నారు. హాలీవుడ్‌ స్టార్ హీరో జిమ్‌ క్యారీ రోజు తన లుక్ ఎలా ఉంటుంది. ఎంత గెడ్డం పెరిగిందో చూపిస్తూ సోషల్ మీడియాలో అప్‌ డేట్‌ ఇస్తున్నాడు. మరికొందరు స్టార్స్ తమ వర్క్‌ అవుట్ వీడియోలను ఇంట్లో తాము చేసుకుంటున్న ఏర్పాట్ల వీడియోలను అభిమానలుతో షేర్ చేసుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: