టాలీవుడ్ అగ్ర దర్శకుల్లో దిల్ రాజు, అల్లు అరవింద్ ముందు వరుసలో ఉంటారు. అల్లు అరవింద్ సీనియర్ నిర్మాత కాగా... దిల్ సినిమా తర్వాత దిల్ రాజు ఫేమస్ అయ్యారు. అక్కడి నుంచి వరుసగా సినిమాలు చేయడమే కాకుండా స్టార్ హీరోలతో సినిమాలు చేసి మంచి లాభాలు గడించారు. ఆయన తో సినిమా అనగానే స్టార్ ధర్శాకుడ్లు ఎక్కువగానే ఆసక్తి చూపిస్తూ ఉంటారు. స్టార్ హీరోలు కూడా ఆయనతో సినిమా చేయడానికి ముందుకి వస్తారు. కాని దిల్ రాజు మాత్రం ఆచితూచి సినిమాలు చేస్తూ ఉంటారు. కథ బాగుంది అనుకుంటే చిన్న హీరోలతో కూడా సినిమాలు చేయడం ఆయన స్టైల్. 

 

అయితే వీరి మధ్య ఇటీవల విభేదాలు వచ్చాయని కొందరు అంటున్నారు. వాస్తవానికి గీత గోవిందం సినిమాను దిల్ రాజు చెయ్యాలని భావించారు. కాని అనూహ్యంగా ఆ సినిమాను అల్లు అరవింద్ చేసారు. అక్కడి నుంచి కూడా వీరి మధ్య విభేదాలు ఉన్నాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. మహేష్ బాబు తో సినిమా చేయడానికి కూడా అల్లు అరవింద్ ఆసక్తి చూపించగా దిల్ రాజు అడ్డం పడ్డారని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. అలాగే మరో స్టార్ హీరో తో సినిమా చెయ్యాలని దిల్ రాజు చూడగా అల్లు అరవింద్ ఆ ప్రాజెక్ట్ లోకి వచ్చారని అంటున్నారు. 

 

ఇక సినిమా హాల్స్ విషయం లో కూడా వీరి మధ్య విభేదాలు వచ్చాయని టాలీవుడ్ వర్గాలు అంటున్నాయి. సంక్రాంతికి ఈ ఇద్దరి సినిమాలు వచ్చాయని కాని ఎక్కువగా అల్లు అరవింద్ ఆధిపత్యమే నడిచింది అంటున్నారు. అందుకే వీరు ఇద్దరి మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయని అంటున్నారు. చిన్న హీరోల జోలికి అల్లు అరవింద్ వచ్చే వారు కాదు. కాని ఈ మధ్య కాలంలో ఆయన కూడా వారి తో సినిమాలు చెయ్యాలని చూడటం దిల్ రాజుకి నచ్చడం లేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: