టాలీవుడ్ లో హీరోయిన్ గా తమన్నా అడుగు పెట్టి దాదాపు పదేళ్ళు అవుతున్న సంగతి తెలిసిందే.  ఆమె సీనియర్ హీరోయిన్ అయినా సరే ఆశించిన స్థాయిలో ఆమెకు గుర్తింపు రాలేదు. ఆమె చేసిన సినిమాల్లో ఎక్కువగా ఫ్లాప్ సినిమాలే ఉన్నాయి అనేది కొందరి మాట. అందుకే ఆమెను దర్శక నిర్మాతలు ఎక్కువగా పట్టించుకునే ప్రయత్నాలు చేయరని అంటూ ఉంటారు. ఈ మధ్య కాలంలో మిల్కీ బ్యూటి హవా తగ్గింది. ఒకప్పుడు ఆమెతో సినిమా చెయ్యాలి అనుకున్న వాళ్ళు ఇప్పుడు ఎక్కువగా ఆమెతో సినిమా చేయడానికి ఆసక్తి చూపించడం లేదు. 

 

దీనికి కారణం ఏంటీ అనేది తెలియకపోయినా ఇప్పుడు ఆమె ను పెద్దగా అభిమానులు పట్టించుకునే అవకాశం లేదని యువ హీరోయిన్ ల హవా ఎక్కువగా మొదలయింది అని అంటున్నారు. ప్రస్తుతం ఆమె సినిమాలకు అంత క్రేజ్ లేదు అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. అయితే ఇటీవల ఆమె స్టార్ హీరోల సినిమాల్లో ఎక్కువగా ఐటెం సాంగ్స్ చేస్తుంది. ఈ సాంగ్స్ బాగానే హిట్ అవుతున్నాయి అనే విషయం స్పష్టంగా అర్ధమవుతుంది. ఇటీవల సరిలేరు నీకెవ్వరు సినిమాలో ఆమె చేసిన ఐటెం సాంగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. 

 

జై లవకుశ సినిమాలో కూడా ఆమె చేసిన ఐటెం సాంగ్ కి మంచి గుర్తింపు వచ్చింది. అయితే ఆమెకు ఐటెం సాంగ్స్ అంతగా ఆసక్తి లేదని ఆమె వాటి మీద ఎక్కువగా ఆసక్తి చూపించడం లేదని అంటున్నారు సినీ జనం. వాటి తో ఆమె కు చెడ్డ పేరు వస్తుందని దానికి తోడు కొందరు నిర్మాతలు ఆమెను స్కిన్ షో ఎక్కువగా చెయ్యాలి అని కోరడం కూడా ఆమెకు నచ్చడం లేదని అందుకే ఇప్పుడు ఆమె వాటికి దూరంగా ఉండే ఆలోచనలో ఉందని అంటున్నారు. త్వరలో సినిమాలకు గుడ్ బై చెప్పే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: