ఎవరైనా సొంత గడ్డ అంటే ఇష్టపడతారు. తాము ఎన్ని దేశాలు తిరిగినా ఎంత వైభవంగా బతికినా సొంత ప్రాంతం అంటే  మమతానురాగాలు చాలా ఎక్కువగా  ఉంటాయి. అది వేరే చెప్పాల్సిన అవసరం లేదు. అలాంటి పుట్టిన గడ్డ ఇపుడు పుట్టెడు కష్టాల్లో ఉంది. మరి మన వాళ్ళు చేసిందేంటి.

 

దేశమంతా ఇపుడు కరోనా వైరస్ చిక్కుల్లో ఉంది. అది అల్లకల్లోలంగా మారకుండా చూసుకోవాల్సిన బాధ్యత అందరిపైనా  ఉంది. అయితే ఇపుడు ధనవంతులు, బడా బాబులు ఉన్న అతి పెద్ద దేశంలో పేదలను ఆదుకోవడానికి పెద్ద వాళ్ళు ముందుకురావాల్సిన అవసరం ఉంది. మన టాలీవుడ్ హీరోలు కరోనా వైరస్ పై యుధ్ధానికి ముందుకు రావడం మంచి పరిణామం. ఇది చాలా ఆహ్వానించదగినదే.

 

అయితే తెలంగాణాతో పాటు ఆంధ్రాకు టాలీవుడ్ చేస్తున్న సాయం చూస్తే సరి సమానంగా ఉంది. కానీ ఇక్కడ ఆర్ధిక  పరిస్థితి అలా లేదు.  విభజనతో ఆంధ్రా అన్ని విధాలుగా నష్టపోయి అష్ట‌కష్టాలు పడుతోంది. తెలంగాణాతో పోలిస్తే అతి పేద రాష్ట్రంగా ఉంది. అటువంటి ఆంధ్రా విషయంలో మన హీరోలు మరింత ఉదారంగా ముందుకు రావాల్సిన అవసరం ఉంది.

 

ఎందుకంటే టాలీవుడ్ హైదరాబాద్ లో సెటిల్ అయినా కూడా మన హీరోలందరి మూలాలూ ఆంధ్రాలోనే ఉన్నాయి. ఇపుడు ఏపీలో నిధుల లేమి ఎక్కువగా ఉంది. అందువల్ల కాసింత పెద్ద మనసు చేసుకోవాలి. రూపాయికి రెండు రూపాయలు అదనంగా సాయం చేయాల్సిన అవసరం ఉంది. 

 

వారు అలా నిండు మనసులో ముందుకు వచ్చి విరాళాలు ఇస్తేనే తప్ప ఏపీలో కరోనా విపత్తుని గట్టిగా ఎదుర్కొనే శక్తి లభిస్తుంది. ఈ విషయంలో మన హీరోలు పెద్దలుగా మారాలి.  ఒక్కో సినిమాకు పాతిక నుంచి యాభైకోట్ల పై చిలుకు తీసుకునే హీరోలు ఒక్క సినిమా ఆదాయంలో వందవ శాతం మాత్రమే  దానం చేశారు. అందులో  ఏపీకి రెండువందల  శాతం మాత్రమే  చేశారు. మరి దాన్నే ఏ పదో శాతంగా మారినట్లైతే ఏపీ సహాయ నిధికి దండీగా డబ్బు సమకూరుతుంది.

 

ఈ విషయంలో భేషజాలు, స్వీయ లాభాలకు, స్వార్ధ రాజకీయాలను రానీయకుండా హీరోలు ముందుకు వస్తే అన్నపూర్ణ లాంటి ఏపీ కరోనా పైన యుధ్ధంలో పూర్తిగా జ‌యించి తీరుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: