కరోనా మహమ్మారి కారణంగా దేశ వ్యాప్తంగా లాక్‌డౌన్‌ ఉండటంతో ప్రతి ఒక్కరూ ఇంటికే పరిమితమయ్యారు. ఈ లాక్‌డౌన్ పీరియడ్‌లో చాలా మంది ఇంట్లోనే ఉంటూ కుటుంబంతో సమయాన్ని గడుపుతున్నారు. అయితే, తమ అవసరాన్ని బట్టి కొంత మంది ఇంటి నుంచి పనిచేస్తున్నారు. ఇక సినిమా పరిశ్రమకు చెందిన వాళ్లు ఈ లాక్‌డౌన్ సమయంలో తమ చిత్రాలకు సంబంధించి వాళ్ల స్క్రిప్ట్స్, పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేసుకుంటున్నారు. వీరిలో ఆర్.ఆర్.ఆర్ సినిమా టీమ్ కూడా ఉంది.

 

ఎన్టీఆర్ ఇస్తానని చెప్పిన రామ్ చరణ్ పుట్టినరోజు సర్‌ప్రైజ్ వీడియో లేట్ అవడానికి కారణం వర్క్ ఫ్రమ్ హోం అని అర్థమవుతోంది. ఈ చిత్రం తెలుగుతో పాటు హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో రూపొందుతోన్న విషయం తెలిసిందే. ఈరోజు వీడియోను అన్ని భాషల్లో ఒకేసారి విడుదల చేసారు. రామ్ చరణ్‌కు బర్త్‌డే గిఫ్ట్‌గా ఈ వీడియోను ఇవ్వడానికి ఎన్టీఆర్, కీరవాణి, రాజమౌళి, ఆయా భాషల మాటల రచయితలు ఇంటి వద్ద నుంచే పనిచేసారు.


తమిళ వర్షన్ వీడియో కోసం పనిచేసినప్పుడు రాజమౌళి, కీరవాణి, మధన్ కార్కి కలిసి వీడియో కాల్ ద్వారా ఎన్టీఆర్ తమిళ డైలాగ్ డెలివరీని పర్యవేక్షించారు. అయితే, ఎన్టీఆర్ తమిళ డైలాగ్ డెలివరీ చూసి రచయిత మధన్ కార్కి ఆశ్చర్యపోయారు. ఇదే విషయాన్ని ఆయన ట్వీట్ చేశారు. ‘‘ఈ మూవీ కోసం దర్శకుడు రాజమౌళి, సంగీత దర్శకుడు కీరవాణితో కలిసి ఇంటి వద్ద నుంచే పనిచేస్తున్నాను. రీమోట్ ద్వారా వాయిస్ రికార్డింగ్‌ను పర్యవేక్షించాం. తమిళ డైలాగులను తారక్ అద్భుతంగా చెప్పారు. సినిమాలో ఆయన వాయిస్‌ను వినడానికి సిద్ధంగా ఉండండి’’ అని తమిళ ప్రేక్షకులను ఉద్దేశించి మధన్ ట్వీట్‌లో పేర్కొన్నారు. రామ్ చరణ్ స్పెషల్ వీడియోను ప్రేక్షకులకు అందించడానికి రాజమౌళి అండ్ టీం ఎంత కష్టపడిందో అర్థమవుతోంది. 

https://twitter.com/madhankarky/status/1243389190395445249?s=20

https://twitter.com/madhankarky/status/1243389190395445249?s=20

మరింత సమాచారం తెలుసుకోండి: