కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తుంది. ఈ వైరస్ భయంతో ఎక్కడి పనులు అక్కడే వదిలేసి అందరూ ఇళ్లలోనే ఉండాల్సి వచ్చింది. ఇప్పటికే పలు రాష్ట్రాల్లో కరోనా కేసులు నమోదయ్యాయి. ప్రతి రోజూ వీటి సంఖ్య ఒక్కొకటిగా పెరుగుతూ వస్తుండటం తో దేశంలోని ప్రజలందరూ అప్రమత్తం అయ్యారు. పలువురు స్వీయ క్వారంటైన్ పాటిస్తూ బయటకు రాకుండా తమవంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఈ వైరస్ ప్రభావం ప్రతి ఒక్క పరిశ్రమ పైనా పడింది. దాదాపుగా స్వచ్చందంగా అన్నింటినీ కొన్ని రోజుల పాటు మూసివేశారు. 

 

సినీ పరిశ్రమ కు కూడా ఈ కరోనా ఎఫెక్ గట్టిగానే కొట్టింది అని చెప్పాలి. షూటింగులు, ఆడియో రిలీజ్ ఫంక్షన్ లు, కొత్త సినిమాల రిలీజ్ అన్ని కూడా కరోనా కారణంగా నిలిచిపోయాయి. ఎప్పుడూ షూటింగ్ లతో బిజీ గా ఉండే సినీ జనాలు ఈ కరోనా కారణంగా కాస్త కాళీ సమయం దొరకడంతో చాలా మంది కుటుంబ సభ్యుల తో సరదాగా గడుపుతున్నారు. వారి క్వరంటైన సమయాన్ని ఫొటోస్ తీసి సోషల్ మీడియా ద్వారా తమ అభిమానులతో పంచుకుంటున్నారు. అయితే తెలుగు ఫిల్మ్  ఇండస్ట్రీలో వరుస అవకాశాలతో బిజీగా ఉన్న పూజా హెగ్డే మాత్రం ఇందుకు భిన్నంగా ఆలోచిస్తుంది.

 

అదేంటంటే పూజా సొంతంగా ఒక యూట్యూబ్ చానెల్ ఓపెన్ చేసే ఆలోచన చేస్తుందట. ఆ ఛానల్ లో రోజు తన క్వరంటైన్ సమయాన్ని ఏ రకంగా గడుపుతుంది అనే విషయాలను ఈ ఛానెల్ ద్వారా అందరితోనూ పంచుకునే ఆలోచనలో ఉంది. అంతే కాకుండా పూజా దీన్లో తన చిన్ననాటి సంగతులు, తను మిస్ ఇండియా గా ఎంపికైన విషయాలు, సినీ ఇండస్ట్రీ లో తన కెరీర్ ఎలా మొదలైంది అనే అన్ని విషయాలను ఈ ఛానెల్ ద్వారా అందరితోనూ పంచుకునే ఆలోచనలో ఉంది అన్నట్టు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఇప్పుడు నడుస్తున్న టాక్. ఏదైతేనేం కరోనా కాలం కూడా పూజా హెగ్డే కు ఈ రకంగా కలిసివస్తుందేమో చూద్దాం అని సినీ జనాలు అనుకుంటున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: