ప్రస్తుతం ప్రపంచమంతా భయంకర కరోనా వైరస్ గుప్పిట్లో చిక్కుకుంది. సాక్షాత్తూ బ్రిటిష్ రాజు చార్లెస్ కు, ఆ దేశ ప్రధాని బోరిస్ జాన్సన్ కు కరోనా పాజిటివ్ అని తేలిందంటే పరిస్థితి తీవ్రత అర్ధం చేసుకోవచ్చు. ఇక సామాన్యుల పరిస్థితి ఎలా ఉందో ఊహకే అందని విషయం. ఈ తరహా ఉదాహరణలతోనే భారత్ లో అత్యంత కట్టుదిట్టమైన జాగ్రత్తలు తీసుకుంటోంది. ఏప్రిల్ 14వరకూ లాక్ డౌన్ ప్రకటించేశారు. దేశమంతా ఒకేతాటిపైకి వస్తున్న ఈ సమయంలో కరోనా వైరస్ ను అరికట్టేందుకు మన తెలుగు సినీ హీరోలు ప్రభుత్వాలకు తమ వంతు సాయాన్ని భారీ విరాళాలుగా అందిస్తున్నారు.

 

 

అయితే.. హీరోలు వచ్చినంత సులువుగా హీరోయిన్లు ఈ విషయంలో ముందుకు రావటం లేదు. హీరోలతో పోలిస్లే హీరోయిన్ల రెమ్యునరేషన్లు చాలా తక్కువే. కానీ స్టార్ హీరోయిన్లు డిమాండ్ చేసి మరీ రెమ్యునరేషన్లు తీసుకుంటున్నారు. హీరోల మాదిరిగా కోట్లలో కాకపోయినా తమ వంతుగా కొద్దిగా లక్షల్లో ప్రభుత్వానికి అందించినా బాగుండేది. కానీ సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉన్నంతగా ఇటువంటి విపత్కర సమయాల్లో మాత్రం ఏమాత్రం ముందుకు రావటం లేదనేది వాస్తవం. తమ వంతుగా కరోనా వైరస్ నుంచి అందరూ తమను తాము ఎలా కాపాడుకోవాలలో సోషల్ మీడియా వేదికగా పోస్టులు చేస్తూ అవగాహన కల్పించడం ముదావహమే.

 

 

కానీ.. ఆర్దికంగా కూడా ప్రభుత్వాలకు తమ వంతు సాయమందిస్తే తమను ఆదరిస్తున్న ప్రేక్షకుల్లో మంచి అభిప్రాయం కలుగుతుంది. హీరోయిన్ ప్రణీత ఓ స్వచ్ఛంద సంస్థతో కలిసి 50 కుటుంబాలకు 2వేలు చొప్పున ఇస్తున్నట్టు ప్రకటించింది. ఈ తరహాలో చిన్న సాయమైనా ఎందరికో అది ఉపయోగపడుతుంది. ప్రజల కోసం ఎన్నో చర్యలు తీసుకుంటున్న ప్రభుత్వాలకు తమ వంతు సాయం అందించడం హీరోలపై మంచి అభిప్రాయాన్ని కలుగజేస్తోంది. మరి హీరోయిన్లు ఏం చేస్తారో..!

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: