రామ్ చరణ్... టాలీవుడ్ లో అతి తక్కువ కాలంగా స్టార్ హీరో హోదా సంపాదించిన హీరో. వరుసగా సినిమాలు చేస్తూ ఆ సినిమాలు హిట్ అయినా ఫ్లాప్ అయినా సరే రామ్ చరణ్ మాత్రం వెనక్కు తగ్గకుండా సినిమాలు చేస్తూ వస్తున్నాడు. అతని సినిమాలకు ఒక ప్రత్యేకమైన క్రేజ్ కూడా ఉందీ అనేది వాస్తవం. ప్రస్తుతం అతను టాలీవుడ్ లో అగ్ర హీరోగా ఉన్నాడు. రాజమౌళి దర్శకత్వంలో ఆర్ఆర్ఆర్ అనే సినిమా చేస్తున్నాడు. ఇప్పుడు ట్రిపుల్ ఆర్ కోసం అందరూ ఎదురు చూస్తున్నారు. అయితే మెగా ఫ్యామిలీ లో రామ్ చరణ్ కి ఒక ప్రత్యేక గుర్తింపు ఉంది. 

 

అతను వివాదాలకు ఎప్పుడూ దూరంగానే ఉంటాడు. అతను దాదాపుగా భయపడే మనస్తత్వం తో ఉండడు. అందరు హీరోలతో స్నేహం చేయడానికి ఎక్కువగా ఇష్టపడుతూ ఉంటాడు. రానా, జూనియర్ ఎన్టీఆర్, నాగ చైతన్య ఇలా అందరితో అతను సినిమాలు చేస్తూ ఉంటాడు. అగ్ర హీరో అయినా సరే ఏ మాత్రం అహంకారం ఉండదు. ఏ మాత్రం భయం లేకుండా సినిమాల్లో ప్రయోగాలు చేయడానికి రెడీ అవుతాడు. రంగస్థలం లాంటి సినిమా చెయ్యాలి అంటే నిజంగా ధైర్యం ఉండాలి. ఆ సినిమా కథను బహుశా ప్రస్తుతం టాలీవుడ్ లో మరో హీరో చేసే అవకాశం లేదు. 

 

సుకుమార్ ఆలోచన ఏ విధంగా ఉందో ఆ విధంగా నటించాడు మెప్పించాడు. అలాగే చాలా సినిమాలు కథ బాగుంటే చాలు అతను ఓకే చేస్తాడు. ధ్రువ సినిమా అతని కెరీర్ లో ది బెస్ట్ గా నిలిచింది. చిరంజీవి కూడా తన కెరీర్ మొదట్లో లో ఇలాంటి ప్రయోగాలు చేయడానికి ఎక్కువగా ఆసక్తి చూపించే వారు కాదని అంటారు. మెగా హీరోలు ఎవరూ కూడా కెరీర్ మొదట్లో ఇలా ప్రయోగ౦ చేయడానికి ఆసక్తి చూపించలేదు అనేది వాస్తవం.

మరింత సమాచారం తెలుసుకోండి: