ఎంత స్టార్ హీరో అయినా సరే, అతను ఎన్ని హిట్స్ కొట్టినా సరే, అతనికి ఎంత క్రేజ్ ఉన్నా సరే, అతనికి ఫ్యాన్స్ లో ఎంత ఊపు ఉన్నా సరే, అతనిలో హుందాతనం అనేది చాలా అవసరం. అగ్ర హీరో అయినా చిన్న హీరో అయినా పెద్ద హీరో అయినా సరే ఇది చాలా అవసరం అనే విషయాన్ని గ్రహించాలి. చిన్న చిన్న విషయాల్లో పోటీ అనేది చూసే ప్రయత్నం చేయకూడదు. అలా చేస్తే వారికి అంటూ ఒక ప్రత్యేక గుర్తింపు అనేది చాలా తక్కువగా ఉంటుంది అనే విషయాన్ని గ్రహించాల్సిన అవసరం ఉంది. మెగా హీరో రామ్ చరణ్ విషయం లో మాత్రం ఇది పూర్తిగా ఉంటుంది. 

 

అతను చాలా హుందాగా ఉంటాడు.  అవును రామ్ చరణ్ చాలా హుందాగా ఉంటాడు. వేరే స్టార్ హీరో సినిమా విడుదల అవుతుంది అంటే, తన సినిమాను వాయిదా వేసుకుంటాడు. పవన్ కళ్యాణ్ సినిమా అయినా, ఎన్టీఆర్ సినిమా అయినా మరో సినిమా అయినా సరే అతను పోటీలో విడుదల చేయడు. ఇక తండ్రి కంటే కాస్త భిన్నంగా ఆలోచించే ప్రయత్నం ఎక్కువగా చేస్తాడు. ధ్రువ సినిమా సమయంలో పవన్ కళ్యాణ్ సినిమా ఉందని తన సినిమాను వాయిదా వేసుకున్నాడు. గతంలో కూడా ఇలా వాయిదా వేసుకున్న సినిమాలు ఉన్నాయి. 

 

అహం లేకుండా ఉండే విధంగా ఉంటాడు. వాదనలు వివాదాలు అనేవి చాలా దూరంగా ఉంటాడు. వివాదాల్లో అసలు తల దూర్చే ప్రయత్నాలు చేయడు. ఎవరితో పడితే వాళ్ళతో అతను సినిమాలు కూడా చేసే ప్రయత్నం చేయదు అని అంటూ ఉంటారు. ఇక బయట ఏదైనా కార్యక్రమం ఉన్నా సరే హుందాగా ప్రవర్తిస్తాడు అనే పేరు రామ్ చరణ్ కి ఉంది. అతని కెరీర్ ఇప్పుడు పీక్ స్టేజి లో ఉంది. దానికి కారణం ఇదే.

మరింత సమాచారం తెలుసుకోండి: