రాజమౌళి గ్రేట్ డైరెక్టర్. ఈ విషయంలో రెండవ మాటకు డౌట్ లేదు. ఆయన మాస్ పల్స్ తెలిసిన వాడు. అంతే కాదు క్లాస్ ఆడియన్స్ ని కూడా థియేటర్ వద్దకు రప్పించే మేధస్సు ఆయనకే సొంతం. కేవలం టీవీ తెరలకు అతుక్కుపోయి సినిమా హాళ్ళను చూసి చాలా కాలమైన వాళ్ళను కూడా ఆకట్టుకుని రప్పించే నైపుణ్యం రాజమౌళికి మాత్రమే  సొంతం.

 

ఇక రాజమౌళి సినిమాలో హీరో అయినా, విలన్ అయినా, క్యారక్టర్ ఆర్టిస్ట్ అయినా ఎలివేట్ అయ్యేందుకు బాగా చాన్స్ ఉంటుంది. అదే సమయంలో వారి టాలెంట్ కి ఆకాశమే హద్దు అన్నట్లుగా రాజమౌళి మొత్తాన్ని పిండి తీసుకునే తీరుతో కొత్తగా వారు ఆయన సినిమాల్లో  కనిపిస్తారు.

 

రాజమౌళి బాహుబలి రెండు పార్టులుగా తీసి బాలీవుడ్ పొగరుని కిందకు దించాడు. సౌత్ ఇండియా మీద, ముఖ్యంగా టాలీవుడ్ ని  అంతా చూసేలా చేశాడు. అంతే కాదు, ప్రభాస్ వంటి హీరోను బాలీవుడ్ కి అందించాడు. బాహుబలి తరువాత ప్రభాస్ నటించిన సాహో మూవీ బాలీవుడ్లో ఊపేసింది. కలెక్షన్ల పంట పండించింది. అంటే అందులో రాజమౌళి వాటా కూడా ఉంది.

 

ఇపుడు రాజమౌళి మళ్ళీ పాన్ ఇండియా మూవీ చేస్తున్నాడు. ఈ మూవీ మల్టీస్టారర్. ఇందులో జూనియర్ ఎన్టీయార్, రామ్ చరణ్ ఉన్నారు. ఇద్దరూ టాలీవుడ్ వరకూ టాప్ హీరోలు, సౌత్ ఇండియాలో కూడా ప్రభావం చూపగలరు, ఇక రాజమౌళి మెరిట్స్ తో బాలీవుడ్ కో కూడా ఆర్.ఆర్.ఆర్ ప్రభంజనం క్రియేట్ చేయడం ఖాయం.

 

సినిమా తరువాత బాలీవుడ్లో సత్తా చాటే హీరోలుగా చెర్రీ, జూనియర్ ఉంటారా అన్నది చూడాలి. ఎందుకంటే చెర్రీ ఆల్ రెడీ బాలీవుడ్లో ఒక సినిమా చేసి ఫ్లాప్ టాక్ తెచ్చుకున్నాడు. జూనియర్ ఇంకా ట్రై చేయలేదు. ఇపుడు ఇద్దరూ కలసి అక్కడ ఆర్.ఆర్.ఆర్ తో జెండా పాతేస్తారు. అది అంతటితో అగుతుందా. వారి ఇమేజ్ బాలీవుడ్ దాకా పాకుతుందా అన్నది పెద్ద చర్చగా ఉంది.

 

ఇక ఈ సినిమా తరువాత జూనియర్, చెర్రీ ఎంచుకుంటున్న సినిమాలు చూస్తే మాత్రం వారికి పాన్ ఇండియా మూవీ ఆశలు పెద్దగా లేవని అర్ధమవుతోంది. రీజనల్ లెవెల్లో కాన్వాస్ గీసుకున్న మూవీస్ నే నెక్స్ట్ చేసేవాటిగా ఇద్దరు హీరోలూ  లైన్లో  పెట్టారు అంటే  ఆలోచించాల్సిందే. ఏది ఏమైనా బాలీవుడ్ కి సౌత్ నుంచి హీరోలను అందించే ప్రొడ్యూసర్ గా రాజమౌళి సత్తా మరో మారు ఆర్.ఆర్.ఆర్ తో ప్రూవ్ అవుతుందనే అంటున్నారు.

 

మరింత సమాచారం తెలుసుకోండి: