డైరెక్టర్ అనిల్ రావిపూడి ప్రస్తుతం సక్సస్ ఫుల్ డైరెక్టర్ అన్న పేరుని సంపాదించుకొని ఉన్నారు. ఎస్.ఎస్.రాజమౌళి, కొరటాల శివ తర్వాత మళ్ళి ఫ్లాప్ ఎరగని డైరెక్టర్ గా టాలీవుడ్ లో డైరెక్టర్ అనిల్ రావిపూడి పేరుని సంపాదించుకున్నాడు. రాజమౌళి, కొరటాల మాదిరిగా వరుస హిట్స్ తో టాలీవుడ్ లో దూసుకు పోతూ స్టార్స్ ని డైరెక్ట్ అవకాశాన్ని దక్కించుకుంటున్నారు. నందమూరి కళ్యాణ్ రాం తో తీసిన పటాస్ సినిమా నుండి రీసెంట్ గా సూపర్ స్టార్ మహేష్ బాబు తో తెరకెక్కించిన సరిలేరు నీకెవ్వరూ వరకు సూపర్ హిట్స్ అందుకున్నాడు.

 

ప్రస్తుతం అనిల్ రావిపూడి ఎఫ్2 సినిమా సీక్వెల్ కి ఎఫ్3 స్క్రిప్ట్ సిద్దం చేసే పనిలో బిజీగా ఉన్నాడు. దీని కోసం తన టీం తో వైజాగ్ లో ఉన్నాడు. ఇక వాస్తవంగా అనిల్ రావిపూడి సరిలేరు తర్వాత మెగా పవర్ స్టార్ రాం చరణ్ తో ఒక సినిమా చేయాలన్న ప్లాన్ తో ఉన్నాడని ఆ మధ్య టాక్ బాగా వచ్చి వైరల్ అయింది. కాని అది కేవలం గాసిప్ గానే మిగిలిపోయింది. ఇక మే నుండి ఎఫ్3 ని తెరకెక్కించబోతున్నారని అంటున్నారు. ఇందులో సూపర్ స్టార్ మహేష్ బాబు కూడా నటిస్తాడని అంటున్నారు.

 

అయితే అనిల్ రావిపూడి గురించి ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతోంది. ఈ సక్సస్ ఫుల్ డైరెక్టర్ కి ఎప్పటినుండో నందమూరి నట సింహం బాలకృష్ణ తో సినిమా చేయాలన్న కోరిక బలంగా ఉందట. బాలయ్య కోసం కథ కూడా రెడి చేసి 'రామారావు' టైటిల్ కూడా అనుకుంటున్నాడట. మరి ఇది ఎంతవరకు వర్కౌట్ అవుతుందో చూడాలి.

 

అయితే అనిల్ రావిపూడి తెరకెక్కించిన సినిమాలతో సక్సస్ లు అందుకుంటున్నాడు గాని క్రియోటివ్ డైరెక్టర్ గా మాత్రం పేరు సంపాదించుకోలేకపోతున్నాడని ఇండస్ట్రీలో టాక్ మాత్రం గట్టిగా ఉంది. మరి ఇది పోవాలంటే అనిల్ ఎలాంటి సినిమా చేస్తే ఆ పేరు పోగొట్టుకుంటాడో. ఇక అనిల్ కి బాలయ్య తోనే కాదు ఆయన కొడుకు మోక్షజ్ఞ తోను సినిమా చేయాలన్న ఆలోచన ఉందట. 

మరింత సమాచారం తెలుసుకోండి: