సోషల్ మీడియా అనేది మనిషి దైనందిన జీవితంలో భాగమైపోయింది. మనిషికి మనిషికి వారధిగా, కొత్త పరిచయాలు చేసుకోడానికి, ముఖ్యంగా సమాచారం చేరవేయడానికి మనం ఉపయోగిస్తున్న సాధనం. ట్విట్టర్, ఇంస్టాగ్రామ్, ఫేస్ బుక్... ఇలాంటి పదాలు వినకుండా మన రోజు గడవదు అంటే అతిశయోక్తి కాదు. సామాన్య ప్రజానీకం నుండి సెలెబ్రెటీల దాకా అందరూ వీటిని ఉపయోగిస్తున్న వాళ్లే. ఇక మన సినిమా వాళ్ళ విషయానికొస్తే సినీ ప్రముఖులు ఎప్పుడూ తమ అభిమానులతో టచ్ లో ఉండటానికి ఇవి వేదికలుగా ఉపయోగ పడుతున్నాయి. ఇప్పుడు సినిమా ప్రచారానికి కూడా సోషల్ మీడియా కీలకంగా మారింది. కొన్ని గంటల్లోనే సోషల్ మీడియా ద్వారా సినిమా పాటలు, సీన్లు తదితరాలు ప్రపంచవ్యాప్తంగా విస్తరించి సినిమాలకు విపరీతంగా ఉచిత ప్రచారం దొరుకుతోంది.

 

ఇలాంటి నేపథ్యంలో మన టాలీవుడ్ స్టార్స్ కూడా సోషల్ మీడియా ద్వారా అందుబాటులో ఉంటున్నారు.  ఇప్పుడు రీసెంటుగా మెగాస్టార్ చిరంజీవి కూడా సోషల్ మీడియాలో ఎంటర్ అయ్యాడు. వచ్చీ రావడంతోనే సోషల్ మీడియాలలో పోస్టుల వర్షం కురిపిస్తున్నాడు. టాలీవుడ్ ఇండస్ట్రీలో మొత్తం మెగాస్టార్ కి స్వాగతం పలికింది. ఇప్పటికే స్టార్ హీరోలైన అక్కినేని నాగార్జున, విక్టరీ వెంకటేష్, మహేష్ బాబు, ఎన్టీఆర్, అల్లు అర్జున్ మొదలైన వారు సోషల్ మీడియాలో యాక్టీవ్ గా ఉంటున్నారు. అయితే టాలీవుడ్ లో ఇద్దరు మాత్రం ఇంతవరకు ట్విట్టర్ లో అడుగు పెట్టలేదు. వాళ్లే నందమూరి బాలకృష్ణ మరియు యంగ్ రెబెల్ స్టార్ ప్రభాస్. మిగతా హీరోలందరూ తమ సినిమా ప్రమోషన్స్ కోసమో అభిమానులకు టచ్ లో ఉండటం కోసమో ట్వీట్స్ చేస్తూనే ఉంటారు. కానీ వీళ్లిద్దరు మాత్రం అటువైపు తొంగి కూడా చూడలేదు.

 

ప్రస్తుతం దేశంలో కరోనా ప్రభావం వల్ల ప్రభుత్వం దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సినీ ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్ అయింది. షూటింగులు లేక ఖాళీగా ఉన్న సెలెబ్రెటీలు సోషల్ మీడియాలో హోరెత్తిస్తున్నారు. ఇప్పుడు తాజాగా చిరు ఎంట్రీతో ఇప్పుడు ఫోకస్ బాలయ్య, ప్రభాస్ మీదకి మళ్లింది. అందరి హీరోల అభిమానులు వాళ్ల హీరోల పోస్ట్స్ చూసి ఎంజాయ్ చేస్తుంటే వీళ్లిద్దరి అభిమానులు మాత్రం వాటిని మిస్సవుతున్నారు. ఈ నేపథ్యంలో బాలయ్య ఫ్యాన్స్, ప్రభాస్ ఫ్యాన్స్ వీళ్లని కూడా ట్విట్టర్ లోకి ఆహ్వానిస్తున్నారు. అతి త్వరలోనే ట్విట్టర్ లో అడుగు పెట్టాలంటూ వేడుకుంటున్నారు. అభిమానుల కోరిక మేరకు బాలయ్య మరియు ప్రభాష్ ట్విట్టర్ లో ట్వీటకులు అవుతారేమో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: