కరోనా మహమ్మారి ప్రపంచాన్నే వణికించేస్తోంది. ఇప్పటికే 190 దేశాలకు పైగా విస్తరించిన ఈ వైరస్ భారతదేశాన్ని కూడా హడలిస్తున్న సంగతి తెలిసిందే. యావత్ భారత దేశం మొత్తం కూడా కరోనా భయానికి వణికిపోతోంది. ఈ నేపథ్యంలోనే ప్రధానమంత్రి నరేంద్రమోదీ దేశ వ్యాప్తంగా 21 రోజులు లాక్ డౌన్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఈ కరోనా మహమ్మారి కారణంగా సినీ ఇండస్ట్రీ కి కూడా కోలుకోలేని దెబ్బ పడింది. చెప్పాలంటే ఎన్ని వందల కోట్ల నష్టం  వాటిల్లిందో లెక్క కనీసం అంచనాకి కూడా అందే పరిస్థితి లేదు. కరోనా దెబ్బకు దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడంతో సినిమా ఇండస్ట్రీ కూడా లాక్ డౌన్లోకి వెళ్లింది. సౌత్ నార్త్ సహా అన్ని ఇండస్ట్రీలు షూటింగ్లకు బ్రేక్ ఇచ్చి అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. హీరోల దగ్గరి నుండి చిన్న చిన్న టెక్నిషన్స్ దాకా పనులు లేక పోవడంతో ఇంటికే పరిమతమయ్యారు.

 

అయితే కొంతమంది నిర్మాతలు మాత్రం కరోనా డేస్ ని కూడా లెక్క చేయకుండా కక్కుర్తి పడి మరీ క్యాష్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని తెలుస్తుంది. కరోనా వల్ల సినిమా షూటింగులు అర్ధాంతరంగా ఆగిపోయినప్పటికీ కొన్ని సినిమాలు ఇప్పటికే 80-90 శాతం షూటింగ్ చేశారు. దాంతో ఆ సినిమా నిర్మాతలు తమ సినిమా పోస్ట్ ప్రొడక్షన్ పనులు సీక్రెట్ గా చేసుకుంటున్నారట. 

 

ఇండస్ట్రీలో కొంత మంది ప్రొడ్యూసర్స్ తమ ఆఫీసుల్లోనే సీక్రెట్ గా పనులు మొదలు పెట్టేసారని తాజాగా అందిన సమాచారం. అంతేకాదు ఇలా వర్క్ చేస్తున్న టెక్నిషన్స్ కి డబల్ పేమెంట్ కూడా ఇస్తున్నారని తెలుస్తుంది. అయితే ఇప్పుడు ఈ విషయం బయటపడటంతో ఈ సీక్రెట్ పనులకు అడ్డుకట్ట పడిందని ఇప్పుడు టాక్ నడుస్తుంది. ఏదేమైనా ఇప్పుడు కరోనా డేస్ ని కూడా క్యాష్ చేసుకోవాలని చూసిన నిర్మాతలు విమర్శల పాలయ్యారు. ఆ సినీ నిర్మాతలకు మరీ అంత ఆశ ఉండకూడదని మిగతా నిర్మాతలు విమర్శిస్తున్నారట. అయితే ఇలా సీక్రెట్ గా పోస్ట్ ప్రొడక్షన్ పనులు చేపించడానికి కారణం ఇప్పటికే రిలీజ్ డేట్ లాక్ చేసుకోవడమే అని తెలుస్తుంది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. 
క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: