ఎస్ ఎస్ రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ' ఆర్.ఆర్.ఆర్ ' మోషన్ పోస్టర్ ను.. 'రౌద్రం రణం రుధిరం' అనే పూర్తి టైటిల్ ను ఉగాది పండుగ సందర్భంగా విడుదల చేసిన సంగతి తెలిసిందే. ఇక ఈరోజు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా ఓ గిఫ్ట్ ఇస్తానని ఇప్పటికే యంగ్ టైగర్ ఎన్టీఆర్ ప్రకటించారు. అన్నట్టుగానే 'భీమ్ ఫర్ రామరాజు - ' ఆర్.ఆర్.ఆర్ ' అనే టీజర్ ను ఈ రోజు విడుదల చేశారు ఎన్టీఆర్. ఈ టీజర్ తో అందరి అనుమానాలు పటా పంచలైపోయాయి. మొన్న రిలీజ్ చేసిన మోషన్ టీజర్  మీద అందరు అసహనం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. తారక్ అండ్ చరణ్ ఫ్యాన్స్ కి నచ్చినప్పటికి ప్రేక్షకులకి మాత్రం అంతగా నచ్చలేదన్న కామెంట్స్ వచ్చాయి. అంతేకాదు బాహుబలి రేంజ్ లో లేదన్న టాక్ లేదని ఇలా అయితే సినిమా పరిస్థితి ఏంటో అన్నట్టుగా అనుమానాలని వ్యక్తం చేశారు.

 

కాని టీజర్ తో అందరికి మైండ్ బ్లాక్ అయింది. ఇక ఈ టీజర్ ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ ఇస్తూ "ఆడు కనవడితే నిప్పుకణం నిలవడినట్టుంటది.. కలవడితే ఏగుచుక్క ఎగబడినట్టుంటది. ఎదురుబడితే సావుకైనా సెమ్ట ధారకడ్తది. ప్రాణమైనా.. బందూకైనా వానికి బాంచనైతది... ఇంటి పేరు అల్లూరి.. సాకింది గోదారి.. నా అన్న. మన్నెం దొర. అల్లూరి సీతారామరాజు" అంటూ చెప్పే డైలాగ్స్ సినిమా రేంజ్ ఏంటో తెలిపింది. మరో పాన్ ఇండియా సినిమాని జక్కన్న ఇవ్వబోతున్నాడని అందరికి అర్థమైపోయింది. 

 

ఇక విజువల్స్ మళ్ళీ జక్కన్న స్టామినాని మరోసారి నిరూపించాయి. ఇక కీరవాణి బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా చరణ్ పాత్రను పూర్తిగా ఎలివేట్ చేసింది. ఇక ఈ గిఫ్ట్ అదిరిపోయిందని మెగా పవర్ స్టార్ రాం చరణ్ తెగ సంతోషపడుతున్నాడట. అంతేకాదు రాజమౌళి చరణ్ కి బర్త్ డే గిఫ్ట్ ఈ రేంజ్ లో ఇస్తారని ఊహించలేదని సర్‌ప్రైజ్ అవుతున్నారట. నిజంగా జక్కన్న ఇలాంటి గిఫ్ట్ ఇస్తారని ఎవరైనా ఊహిస్తారా అంటూ మెగా ఫ్యాన్స్ కూడా సర్‌ప్రైజ్ అవుతున్నారట. ఇక ఈ సినిమా ఎప్పుడెప్పుడు వస్తుందా అని సౌత్ ప్రేక్షకులు మొత్తం ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ సినిమా దెబ్బతో ప్రభాస్ మాదిరిగా రాం చరణ్ తారక్ పాన్ ఇండియా స్టార్స్ అవడం ఖాయమని ఇప్పటికే ఫిక్సైపోయారు.  

మరింత సమాచారం తెలుసుకోండి: