తెలుగు సినిమా పరిశ్రమలో ప్రముఖ నటి  రంభ. టాలీవుడ్‌తో పాటు బాలీవుడ్, తమిళ సినిమాల్లో తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్న రంభ, అసలు పేరు విజయలక్ష్మి. అయితే సినిమాల్లో రంగప్రవేశం చేసాక అందరు రంభ లాగా ఉంటావని అనేటప్పటికీ రంభ అనే పేరు వచ్చింది. రంభ ని తెలుగు సినిమాకి  పరిచయం చేసిన దర్శకుడు ఈవివి సత్యనారాయణ. ఆ ఒక్కటి అడక్కు సినిమా  ద్వార  హీరోయిన్ గా  పరిచయం అయింది.

 

అమాయకపు మొహంతో, డైలాగ్ లతో, నటనతో, నాట్యంతో వయ్యారాలు వలకపొసింది. ఆ తర్వాత  సూపర్ హిట్ సినిమాలు చేసి తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. అల్లుడా మజాకా, బొంబాయి ప్రియుడు, హిట్లర్ సినిమాలతో మంచి పేరు సంపాదించుకుంది. అలాగే పొట్టి పొట్టి బట్టలతో అప్పటి యువతని ఉర్రుతలూగించింది. బొంబాయి ప్రియుడు సినిమాలో రంభ ని చూడడానికే చాలా మంది అప్పట్లో ఆ సినిమా చుసేవారట. అసలు స్వర్గంలో రంభ, ఊర్వశి, మేనకా అనే ముగ్గురు అతిలోక సుందరీలు ఉంటారన్న మాట ఎంత  నిజమో కాదో తెలియదు కానీ తెలుగు ఇండస్ట్రీలో మాత్రం అతిలోకసుందరి అయిన రంభ   మన భూమి మీదనే ఉంది అనటంలో అతిశయోక్తి కాదు. రంభ ఒక నవ్వు నవ్విందంటే చాలు కుర్రకారు అలా పడి ఉంటారు. 

 

రంభ  పాటకి తగ్గట్టు అందాల ఆరబోత కూడా చేసేది. ఒక్కోసారి ఆ ఎక్సపోసింగ్ వల్లే  రంభ కి అంత  గుర్తింపు వచ్చింది. పాటకి తగ్గట్టు పొట్టి డ్రెస్ లు, నాభి అందాలతో కుర్ర కారుని అప్పట్లో ఒక ఊపు ఊపింది. ఈ మధ్య వచ్చిన  కుర్ర హీరోలతో కూడా ఆడి పాడింది. అల్లు అర్జున్ హీరోగా నటించిన దేశముదురు సినిమాలో ఒక ప్రత్యేక గీతంలో నటించింది.

 

 

ఆ పాట ఎంత పెద్ద హిట్ అయిందో చెప్పక్కర్లేదు. అలాగే జూనియర్ ఎన్టీఆర్ తో యమదొంగ సినిమాలో " నాచోరో నాచోరే " పాటలో కూడా  నృత్యం చేసి అలరించింది. రెండు పాటలు సూపర్ హిట్ అయ్యాయి. కొన్నాళ్ళకి  వివాహం చేసుకుని సినిమాలకు దూరమైనది. ఏది ఏమయినా కొన్నాళ్ల పాటు ఇండస్ట్రీ ని ఒక ఊపు ఊపేసింది. రంభ పేరు చెబితే చాలు 'అబ్బా రంభానా' అని అనిపించుకుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: