పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ తన పెద్దన్నయ్య మెగాస్టార్ చిరంజీవి ని పొగడ్తలతో ముంచెత్తాడు. అలాగే క‌రోనా విప‌త్తును ఎదుర్కొనేందుకు ఆర్థిక సాయం ప్ర‌క‌టించిన‌, అందించిన ప్ర‌తి ఒక్క హీరోకి, సినీ సంబంధిత వ్య‌క్తికి ప‌వ‌న్ పేరుపేరునా కృత‌జ్ఞ‌తలు చెప్పాడు. క‌రోనా మహమ్మారిని క‌ట్ట‌డి చేయ‌డానికి ప్ర‌ధాని నరేంద్ర మోడీ దేశ‌వ్యాప్తంగా లాక్‌డౌన్ ప్ర‌కటించిన విష‌యం తెలిసిందే. అలాగే రెండు తెలుగు రాష్ట్రాల ముంఖ్య మంత్రులు లాక్‌డౌన్ ని ప్రకటించి కఠిన చర్యలు చేపడుతున్నారు. ఈ నేప‌థ్యంలో సినీ కార్మికుల కోసం ప్రముఖ నటుడు చిరంజీవి రూ. కోటి విరాళంగా ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ విషయమై జనసేన అధ్యక్షుడు పవన్‌ కళ్యాణ్‌ చిరంజీవి కి కృత‌జ్ఞ‌తలు తెలిపాడు.

 

సినిమా ప‌రిశ్ర‌మ క‌ష్టాల్లో ఉన్న స‌మ‌యంలో ఆప‌ద్బాంధ‌వుడిలా ఆదుకునేందుకు వెంట‌నే ముందుకొచ్చిన త‌న అన్న చిరంజీవి సినీ కార్మికుల కోసం రూ.కోటి విరాళంగా ప్ర‌క‌టించినందుకు త‌మ్ముడిగా గ‌ర్వ‌ప‌డుతున్న‌ట్టు ప‌వ‌న్ వెల్లడించాడు. 'సినీ పరిశ్రమలోని 24 విభాగాలలోని ప్రతీ టెక్నీషియన్‌, ప్రతీ కార్మికుని శ్రమ తెలిసిన వ్యక్తి చిరంజీవి అని... కరోనా దెబ్బతో ఉపాధి కోల్పోయి సినిమానే నమ్ముకుని జీవిస్తున్న ఎంతో మంది కార్మికులు, టెక్నీషియ‌న్లు ఆర్థికంగా ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని ... అలాంటి వారిని ఆదుకునేందుకు పెద్దన్నగా ముందుకొచ్చిన చిరంజీవికి కృతజ్ఞతలు. ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టాలని నిర్ణయించుకున్న ఆయన దయార్ద్ర హృదయానికి జేజేలు పలుకుతున్నాను' అని తెలిపాడు.

 

అన్న‌య్యతో పాటు రూ. 4 కోట్లు విరాళంగా ఇచ్చిన బాహుబ‌లి ప్రభాస్‌, రూ. 1 కోటీ 25 లక్షలు విరాళంగా ఇచ్చిన అ‍ల్లు అర్జున్‌, కోటి రూపాయల విరాళం ఇచ్చిన మహేష్‌ బాబు, రూ. 75 లక్షలు ఇచ్చిన రామ్‌ చరణ్‌, రూ. 70 లక్షలు ఇచ్చిన జూనియర్‌ ఎన్టీఆర్‌, రూ. 20 లక్షలు  ఇచ్చిన నితిన్‌, త్రివిక్రమ్‌, దిల్‌ రాజు, రూ. 10 లక్షలు చొప్పున విరాళంగా ఇచ్చిన సాయి ధర్మ తేజ్‌, కొరటాల శివ, అనిల్‌ రావిపూడిలకు  పవన్ ప్ర‌త్యేక కృతజ్ఞతలు తెలిపాడు.

 

ఈ నేపథ్యంలో త‌న వంతుగా ప‌వ‌న్ రూ.2 కోట్లు కేంద్రంతో పాటు రెండు తెలుగు రాష్ట్రాల‌కు అంద‌జేసి....సినీ ప‌రిశ్ర‌మ‌లోని హీరోల‌కు ఆద‌ర్శంగా, స్ఫూర్తిగా నిలిచాడు. త‌న‌లా విరాళాలు ప్ర‌క‌టించిన‌, అంద‌జేసిన వాళ్ల‌కు ప‌వ‌న్ కృత‌జ్ఞ‌త‌లు తెల‌ప‌డంతో అభిమానులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇక ఎప్పుడు పేదలకి ఎలాంటి సమస్య వచ్చిన చిత్ర పరిశ్రమలోని వాళ్ళందరు ఒకతాటిపై కి వచ్చి ఆదుకోవడం ఎంతో గొప్ప విషయం.  

 

మరింత సమాచారం తెలుసుకోండి: