బాహుబలి తర్వాత గ్రాఫిక్స్ లేని సినిమా చేస్తా అని మాట అనేసింది రాజమౌళి.. తన మీద ఉన్న ఆడియెన్స్ పెట్టుకున్న అంచనాలు ఒమ్ము చేయడం ఇష్టం లేక మెగా నందమూరి మల్టీస్టారర్ సినిమా చేస్తున్నాడు. ఆర్.ఆర్.ఆర్ రౌద్రం రణం రుధిరం.. ఈ టైటిల్ చూస్తేనే సినిమా ఎలా ఉండబోతుందో అర్ధమవుతుంది. 1920ల నాటి కాలంలో వేరు వేరు ప్రాంతాల్లో స్వేచ్ఛ కోసం పోరాడిన ఇద్దరు రియల్ హీరోస్ అల్లూరి సీతారామారాజు, కొమరం భీమ్ పాత్రల్లో రామ్ చరణ్, ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఇద్దరు కూడా నువ్వా నేనా అన్నట్టుగా తమ నట విశ్వరూపం చూపిస్తున్నట్టు తెలుస్తుంది. 

 

లేటెస్ట్ గా చరణ్ బర్త్ డే కారణంగా ఆర్.ఆర్.ఆర్ లోని అల్లూరి సీతారామరాజు ఫస్ట్ లుక్ టీజర్ వచ్చింది. ఈ టీజర్ చూసిన మెగా ఫ్యాన్స్ మాత్రమే కాదు సగటు సినీ అభిమానికి రోమాలు నిక్కబొడుచుకునేలా చేశాడు రాజమౌళి. అందరి సినిమాలు ఒక ఎత్తైతే రాజమౌళి సినిమా మరో ఎత్తు అనేలా మరోసారి తన సత్తా చాటేందుకు వస్తున్నాడు జక్కన్న. ఇక మన్నెం దోరం అల్లూరిగా రామ్ చరణ్ ను ఇలా చూపించిన రాజమౌళి కొమరం భీమ్ గా ఎన్టీఆర్ ను ఎలా చూపించనున్నాడో అనే ఎక్సయిట్మెంట్ మొదలైంది. అది తెలియాలంటే మాత్రం మే 20, తారక్ బర్త్ డే వరకు వెయిట్ చేయాల్సిందే. 

 

రామ్ చరణ్ పుట్టినరోజు కానుకగా భీమ్ అదేనండి ఎన్టీఆర్ స్పెషల్ గిఫ్ట్ ఇచ్చాడు. అదేవిధంగా తారక్ పుట్టినరోజు కూడా చరణ్ మెమరబుల్ గిఫ్ట్ ఇస్తాడేమో చూడాలి. రిలీజైన సీతారామరాజు ఫస్ట్ లుక్ లో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ కూడా అద్భుతం అని చెప్పొచ్చు. బాహుబలి కాదు దాన్ని మించే హిట్ అందుకునేలా రౌద్రం రణం రుధిరం ను తయారుచేస్తున్నారు రాజమౌళి. ఆ అద్భుతానికి మనం కూడా ప్రత్యక్ష సాక్షులవుదాం. 

 

మరింత సమాచారం తెలుసుకోండి: