సింగర్ గా, డబ్బింగ్ ఆర్టిస్ట్ గా టాలీవుడ్, కోలీవుడ్ ఇండస్ట్రీలలో చిన్మయికి ఎంతో మంచి గుర్తింపు ఉంది. వివాదాస్పద వ్యాఖ్యలతో కూడా చిన్మయి ఎప్పుడూ వార్తల్లో నిలుస్తూ ఉంటుంది. తెలుగు, తమిళంలో వందల పాటలు పాడి ప్రేక్షకుల మనస్సు దోచుకున్న చిన్మయి... తాజాగా తెలుగు ప్రేక్షకులు తనను బూతులు తిడుతున్నారంటూ వ్యాఖ్యలు చేసి మరోసారి వార్తల్లో నిలిచారు. 
 
చిన్మయి మాట్లాడుతూ సోషల్ మీడియాలో తనపై తెలుగువాళ్లు కామెంట్స్ చేస్తున్నారని తెలిపారు. వాళ్లు చేస్తున్న కామెంట్స్ వల్ల తనకు తెలుగు చదవడం వచ్చిందని... తెలుగువాళ్లు తనను లం** అంటూ కామెంట్స్ చేస్తున్నారని చెప్పారు. అబ్బాయిలు మాట్లాడితే ఇదే పదం ఉపయోగిస్తున్నారని వారికి ల**ము** అనే మాట తప్ప ఇంకేం రాదని చెప్పారు. రోజుకు వంద సార్లు అదే పదంతో కామెంట్లు చేస్తున్నారని... తెలుగు సోషల్ మీడియా జనరల్ డీఫాల్ట్ ఏంటో దీన్ని బట్టి సులభంగా తెలుసుకోవచ్చని అన్నారు. 
 
తమిళంకు, తెలుగుకు పెద్ద తేడా లేదని... తెలుగు, తమిళంలో ఇదే మాట అంటారని, ఈ పదం ఇండియా మొత్తం కామన్ అయిపోయిందని వ్యాఖ్యలు చేశారు. ఎవరైనా అలాంటి పదాలు కామెంట్స్ చేస్తే వాళ్ల ఫ్యామిలీ బ్యాక్ గ్రౌండ్ అంతే అని వదిలేస్తున్నానని చెప్పారు. తాను ఏంటో తనకు బాగా తెలుసని... ఎవరో ఏదో అన్నారని ఇంట్లో ఏడుస్తూ కూర్చోనని చెప్పారు. 
 
కొందరు ఫ్యాన్స్ వార్ పేరుతో ఇష్టం వచ్చినట్లుగా బూతులు తిడుతూ ఉంటారని వ్యాఖ్యలు చేశారు. కొందరు ఇంట్లో ఉన్న పిల్లలను కూడా బూతులు తిడతారని అలా చేస్తే పిల్లలు కూడా అలాగే తయారవుతారని చెప్పారు. మా పిల్లలను అలాంటి పిల్లలతో పంపాలంటే ఎంతో భయం వేస్తుందని అన్నారు. వాళ్లు మాట్లాడిన మాటలనే వీళ్లూ మాట్లాడతారని చెప్పారు. భయం వేస్తుంది అంటే పిల్లలు వద్దని కాదని... పిల్లల్ని కనను కాబట్టి స్టేట్ మెంట్ ఇవ్వడం లేదని వ్యాఖ్యలు చేశారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: