టాలీవుడ్ లో అయినా తమిళంలో అయినా సరే కీర్తి సురేష్ తక్కువ కాలంలోనే మంచి పేరు సంపాదించుకున్న హీరో. అతి తక్కువ కాలంలోనే ఆమె స్టార్ హీరోయిన్ హోదాలోకి వెళ్లిపోయింది. ఆమె సినిమాలు ఎక్కువగా పెద్ద హీరోలతోనే ఉన్నాయి. తెలుగులో మహానటి సినిమా ద్వారా ఆమె అందరికి సూపర్ స్టార్ అయిపోయింది. ఈ తరం మహానటి అనుకున్నారు అందరూ. ఆ స్థాయిలో ఆమె నటించి మెప్పించింది అనేది ఎవరూ కాదనలేని వాస్తవం. సావిత్రి పాత్రలో కీర్తి దాదాపుగా జీవించింది అనే చెప్పాలి. ఆ విధంగా ఆమె నటించింది ఆ సినిమాలో. ఆ సినిమా సూపర్ హిట్ అయింది. 

 

ఇది పక్కన పెడితే... కీర్తి సురేష్ స్కిన్ షో విషయంలో మాత్రం చాలా జాగ్రత్త పడుతూ ఉంటుంది. అవకాశం రాకపోయినా పర్వాలేదు గాని స్కిన్ షో మాత్రం చేసేది లేదని చెప్తుంది ఈ భామ. ఆమె చేసిన సినిమాలు అన్నింటి లోను పద్దతిగానే నటించింది. ఏ హీరో పక్కన సినిమా చేసినా సరే కనీస౦ ఆమె చాతి భాగాన్ని కూడా చూపించలేదు. ఎక్కువగా టాప్స్ లేదా డ్రెస్ లు వేయడమే. దర్శకులు కూడా ఆమె విషయంలో అదే విధంగా ఆలోచించారు. ఆమెకు అలాంటి పాత్రలు అయితేనే బాగుంటాయి అని చెప్పారు. ఆమె కూడా అలాంటి పాత్రలు అయితేనే చేస్తాను అని స్పష్టంగా చెప్పింది. 

 

ఇప్పుడు తమిళంలో ఆమె టాప్ హీరోయిన్ గా ఉంది. అక్కడ వరుస ఆఫర్లతో ఆమె కెరీర్ పీక్ స్టేజి లో ఉంది. దాదాపు అందరు అగ్ర హీరోలతో ఆమె అక్కడ సినిమాలు చేసింది. మన తెలుగులో కంటే అక్కడే ఆమెకు మంచి గుర్తింపు ఉంది. ఎంత పారితోషికం ఇచ్చినా సరే తాను మాత్రం స్కిన్ షో చేసేది లేదని కీర్తి దర్శక నిర్మాతలకు ఎప్పుడో చెప్పేసింది.

మరింత సమాచారం తెలుసుకోండి: