తెలుగులో అయినా తమిళంలో అయినా సరే సినిమా చెయ్యాలి అంటే కచ్చితంగా స్కిన్ షో చెయ్యాలని భావిస్తారు. హీరోయిన్ ఎవరు అయినా సరే స్కిన్ షో చేస్తేనే సరైన గుర్తింపు అనేది ఉంటుంది అనే మాట వాస్తవం. టాలీవుడ్ లో ఎక్కువగా స్కిన్ షో కి గుర్తింపు ఎక్కువగా ఉంటుంది. ఎలాంటి సినిమా అయినా సరే హీరోయిన్ చెయ్యాల్సిందే. డాన్స్ అయినా మరొకటి అయినా సరే అందుకు వెనకడుగు వేస్తే మాత్రం పాపం హీరోయిన్ ని పట్టించుకునే వారు ఉండరు. కాని సాయి పల్లవి విషయంలో మాత్రం ఇది పూర్తిగా భిన్నంగా ఉంటుంది అనే మాట వాస్తవం. 

 

ఆమె ఎవరితో సినిమా చేసినా సరే స్కిన్ షో అనే దానికి మాత్రం ఎలాంటి ప్రాధాన్యతా ఇచ్చే అవకాశం దాదాపుగా ఉండదు అనేది వాస్తవం. టాలీవుడ్ లో ఆమె చేసిన సినిమాలు తక్కువే అయినా సరే స్కిన్ షో మాత్రం చేయడానికి ఎంత మాత్రం ఇష్టపడే వారు కాదు. ఇక తమిళంలో అగ్ర హీరోల పక్కన చేసినా మలయాళం లో అగ్ర హీరోల పక్కన చేసినా సరే ఆమె మాత్రం స్కిన్ షో చేసిన సందర్భం ఎక్కడా లేదు. కేవలం తన అందంతో కంటే నటనతోనే ఎక్కువగా అభిమానులను సంపాదించుకున్నారు సాయి పల్లవి. తక్కువ కాలంలో స్టార్ హీరోయిన్ అయిపోయింది ఆమె. 

 

మన తెలుగులో అగ్ర హీరోల పక్కన అవకాశం వచ్చినా సరే స్కిన్ షో మాత్రం చేసేది లేదని చెప్తూ ఉంటారు. వేస్తే డ్రెస్ వేయడం లేదా టాప్ వేయడం. అంతే గాని ఎలా పడితే అలా కనపడి తన స్థాయిని దిగాజార్చుకోను అని చెప్తూ ఉంటుంది సాయి పల్లవి. ఆమెకు కన్నడం లో కొన్ని ఆఫర్లు వచ్చినా సరే స్కిన్ షో ఎక్కడ చెయ్యాల్సి వస్తుందో అని ఆమె చెయ్యలేదు.

మరింత సమాచారం తెలుసుకోండి: