టాలీవుడ్ లో చేసిన సినిమాలు పెద్దగా లేకపోయినా సరే స్టార్ హీరోయిన్ గా గుర్తింపు తెచ్చుకున్న హీరోయిన్ నిత్యా మీనన్. అతి తక్కువ కాలంలో మంచి ఫ్యాన్ బేస్ ని సంపాదించుకున్న హీరోయిన్ ఆమె. స్టార్ హీరోలతో సినిమాలు చేసినా సరే రెండో హీరోయిన్ గా సినిమాలు చేయడమే గాని మొదటి హీరోయిన్ గా ఆమె చేసిన సినిమాలు దాదాపుగా తక్కువ అనే చెప్పాలి. పెద్ద హీరో అయినా చిన్న హీరో అయినా సరే ఆమె రెండో హీరోయిన్ గానే ఎక్కువగా సినిమాలు చేసింది. నటనతో కూడా ఆకట్టుకుంది ప్రేక్షకులను. హడావుడి లేకుండా నటిస్తూ ఉంటుంది నిత్యా మీనన్. 

 

అయితే ఆమె మాత్రం స్కిన్ షో చేసిన సందర్భం అనేది ఉండదు. తక్కువ కాలంలో ఆమె స్టార్ హీరోయిన్ హోదా తెచ్చుకున్నా ఆమె బరువు తగ్గి సినిమాలు చేసినవి ఎక్కడా లేవు. పరిణితి ఉన్న హీరోయిన్ అని కూడా ఆమెను అంటూ ఉంటారు అభిమానులు. ఆమెకు సినిమాలు అంటే ఇష్టం గాని డబ్బులు అంటే ఇష్టం కాదని చెప్తూ ఉంటారు. ఆమె ఏ సినిమా చేసినా సరే ఇలాగే సినిమాలు చేస్తుంది అంటూ ఉంటారు. నటన ఉంటే చాలు సినిమాను చూస్తారని స్కిన్ షో ఉండి నటన లేకపోతే అది హోదా అవ్వదు అంటూ ఆమె ఎన్నో సందర్భాల్లో చెప్పింది కూడా. 

 

ఆమె బరువు ఉన్నా బరువు లేకపోయినా సరే ఆమె నటన ద్వారానే ఆమెకు అవకాశాలు ఎక్కువగా ఇచ్చారు దర్శక నిర్మాతలు. అతి తక్కువ కాలంలో చాలా సినిమాల్లో నటించింది ఆమె. ప్రస్తుతం ఆమె చేతిలో ఉన్న సినిమాలు చాలా తక్కువ. ఐటెం సాంగ్స్ చెయ్యాలని ఆమెను కోరినా సరే ఆమె మాత్రం అందుకు ఎంత మాత్రం ఇష్టపడేది కాదు. అందుకే ఇప్పుడు సినిమాలు చేయడం లేదని అంటూ ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: