నమిత... తెలుగు ప్రేక్షకులకు పెద్ద‌గా ప‌రిచ‌డం అవ‌స‌రం లేని పేరు అన‌డంతో ఏ మాత్రం సందేహం లేదు. చేసింది త‌క్కువ సినిమాలే అయిన‌ప్ప‌టికీ సౌతిండియాలో ఖుష్బూ తర్వాత ఆ రేంజ్ లో ఫాలోయింగ్ సంపాదించిన భామ నమిత. శ్రీను వైట్ల దర్శకత్వంలో ఆర్యన్ రాజేష్ హీరోగా వచ్చిన ‘సొంతం’ సినిమాతో టాలీవుడ్ ఎంట్రీ ఇచ్చింది ఈ బ్యూటి. ఆ త‌ర్వాత వెంకటేష్ హీరోగా నటించిన ‘జెమినీ’ సినిమాతో మంచి గుర్తింపు తెచ్చుకుంది నమిత. మిని సినిమాలో ఆమె నటనకు చాలామంది ఫిదా అయ్యారు. 

IHG

అయితే తెలుగులో సినిమాల ప‌రంగా అంత‌గా స‌క్సెస్ కాలేక‌పోయినా.. తమిళనాట మాత్రం నెంబర్ వన్ హీరోయిన్ అనిపించుకుంది నమిత. తమిళనాట నమితతో సీనియర్ హీరోలతో పాటు యంగ్ హీరోల వరకు అందరితో రొమాన్స్ చేసింది ఈ ముద్గుగుమ్మ. ఇక తమిళంలో నమితకు అభిమానులు ఎంతమంది ఉన్నారో చెప్పక్కర్లేదు. నమితకు తమిళనాడులో గుడి కట్టిన సంగతి తెలిసిందే. అయితే సింహ సినిమాలో బాలకృష్ణతో నమిత ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే. బోయపాటి శ్రీను ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ సినిమాలో  ‘సింహమంటి చిన్నోడే.. వేటకొచ్చాడే..!’ అంటూ బాలకృష్ణతో కలిసి స్టెప్పులేసిన ఈ ముద్దుగుమ్మ అందాలు చూస్తే క‌ళ్లు తిప్పుకోలేరు.

IHG

ఎందుకంటే ఈ చిత్రంలో ఆమె ఎలాంటి మొహ‌మాటం లేకుండా ఓ రేంజ్‌లో ఎక్స్‌పోజింగ్ చేసింది. ఈ సినిమానే కాకుండా ప్ర‌భాస్ హీరోగా వ‌చ్చిన బిల్లా సినిమాలో సైతం న‌మిత ఎక్స్‌పోజింగ్‌ చూసి మ‌తిపోగుట్టుకున్న‌వాళ్లు ఎంద‌రో. వాస్త‌వానికి  హీరోయిన్లంతా జీరోసైజ్ ఫిగర్ మెయిన్‌టెయిన్ చేస్తుంటే... నమిత మాత్రం ఫుల్ సైజు అందాలతో ప్రేక్షకులను ఆకట్టుకుంది. అయితే ప్రియుడు వీరేంద్ర చౌదరితో పెళ్లిఅయినప్పటి నుంచి వెండితెరకు దూరమైంది నమిత. ఒక‌వేళ నమిత తిరిగి ఇండస్ట్రీలోకి అడుగుపెడితే ఆమెకు అవకాశాలు తప్పకుండా వస్తాయి అనడంలో సందేహం అవసరం లేదు. ఎందుకంటే ఆమె అందాలు అలాంటివి మ‌రి..!!

మరింత సమాచారం తెలుసుకోండి: