సాయి ధరమ్ తేజ్ తమ్ముడు వైష్ణవ్ తేజ్ హీరోగా పరిచయం అవుతున్న చిత్రం ఉప్పెన. సుకుమార్ శిష్యుడు బుచ్చిబాబు సానా దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాని మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తుంది. అయితే సాధారణంగా హీరో లాంచింగ్ సినిమాలకి ఎక్కువ డబ్బులు పెట్టరు. మొదటి సినిమా కాబట్టి మార్కెట్ పరంగా ఇబ్బందులు వస్తాయి కాబట్టి రికవరీ అవుతుందో లేదో అన్న భయం ఉంటుంది.

 

అందుకే తక్కువ బడ్జెట్ లోనే సినిమాని తెరకెక్కించే ప్రయత్నం చేస్తారు. అయితే ఉప్పెన చిత్రానికి మాత్రం అనుకున్న దానికంటే ఎక్కువ డబ్బులు ఖర్చు పెట్టారట. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్న ఈ చిత్రంలో నుండి ఇప్పటికే రెండు పాటలు రిలీజ్ చేశారు. నీ కన్ను నీలి సముద్రం, ధక్ ధక్ ధక్ అంటూ సాగిన ఈ పాటలు చాలా వైరల్ అయ్యాయి. ఈ పాటలతో సినిమా పట్ల ఓ పాజిటివ్ బజ్ ఏర్పడింది. సినిమాపై అంచనాలు కూడా పెరిగాయి. 

 


కానీ ఈ అంచనాలను సినిమా అందుకుంటుందా లేదో తెలియదు. కానీ నిర్మాతలకి మాత్రం ఈ సినిమాపై బాగా నమ్మకం ఉందట. అందుకే మామూలుగా పెట్టేదాని కంటే ఎక్కువ డబ్బునే ఈ చిత్రం కోసం పెట్టారట. సుమారుగా ౨౨ కోట్లు ఈ సినిమాకోసం పెట్టారట. కొత్త హీరో సినిమాకి ఇన్ని డబ్బులు పెట్టడం ఆశ్చర్యం కలిగించే విషయమే. అయితే వైష్ణవ తేజ్ మెగా ఫ్యామిలీ నుండి కావడ ఒకటి..ఇంకా దర్శకుడూ బుచ్చిబాబు మీద ఉన్న నమ్మకం ఉండడం కూడా ఇంతటి రిస్క్ చేయడనికి కారణం అని తెలుస్తుంది.

 


మరి మైత్రీ మూవీస్ చేస్తున్న ఇంతటి రిస్క్ వల్ల వారు లాభపడతారా అన్నది సందేహంగా ఉంది. సినిమాకైతే మంచి పాజిటివ్ నజ్ ఏర్పడిన మాట మాత్రం వాస్తవం. కరోనా ఎఫెక్ట్ తగ్గాక రిలీజ్ అయ్యే ఈ చిత్రం మైత్రీ మువీస్ నమ్మకాన్ని నిలబెడుతుందో లేదో చూడాలి.

మరింత సమాచారం తెలుసుకోండి: