సౌత్ సినీ పరిశ్రమల్లో విలక్షణ నటులలో ప్రస్తావిస్తే అందులో ప్రకాష్ రాజ్ పేరు తప్పకుండా ఉంటుంది. తనకు ఇచ్చిన పాత్ర ఎలాంటిదైనా దానికి నూటికి నూరు పాళ్ళు న్యాయం చేస్తాడు. 300 రూపాయల స్టేజ్ షోలతో ప్రారంభమైన ఆయన నట జీవితం వీధి నాటకాల్లో నటిస్తూ గుర్తింపు  తెచ్చుకున్నారు. కన్నడ పరిశ్రమకు చెందిన ప్రకాష్ రాజ్ కన్నడ భాషలో మొదట్లో టివి షోల్లో నటించారు. ఆ తర్వాత సినిమాల్లో అవకాశం అందుకున్నారు. ప్రకాష్ రాజ్ మొదటి సినిమా కన్నడలో మితిలెయా సీతెయారు చేశారు. కె బాలచందర్ డ్యూయెట్ సినిమాతో తమిళ పరిశ్రమలో అడుగుపెట్టారు ప్రకాష్ రాజ్. 

 

ప్రకాష్ రాజ్ మొదటితెలుగు సినిమా సంకల్పం. ఆ సినిమా నుండి ఇప్పటివరకు తెలుగు, తమిళ, కన్నడ , హిందీ భాషల్లో వరుస సినిమాలు చేశారు. నటుడిగా ప్రకాష్ రాజ్ సరికొత్త భాష్యం నేర్పించారు. తెలుగులో ఆయన చేసిన అంతఃపురం సినిమా స్పెషల్ క్రేజ్ తెచ్చింది. అంతేకాదు నేషనల్ అవార్డు స్పెషల్ ,మెన్షన్ కేటగిరిలో అందుకున్నారు. తమిళంలో చేసిన ఇరువుర్ సినిమాలో బెస్ట్ సపోర్టింగ్ రోల్ లో నేషనల్ అవార్డు అందుకున్నారు. ఆ తర్వాత తమిళంలో నటించిన కాంచీవరం సినిమాకు గాను బెస్ట్ యాక్టర్ గా నేషనల్ అవార్డు అందుకున్నారు. కన్నడ సినిమా పుట్టక్కన హైవే సినిమాకు గాను మరో నేషనల్ అవార్డు అందుకున్నారు. 

 

నటుడిగా ఎన్నో అవార్డులు రివార్డులు  అందుకోవడమే కాదు సౌత్ అన్ని భాషల్లో ఎంతోమంది అభిమానులను సంపాదించుకున్నారు ప్రకాష్ రాజ్. తెలుగులో ప్రతినాయకుడిగా ప్రకాష్ రాజ్ కు ప్రత్యేకమైన క్రేజ్ ఉంది. ఒకనాకొక దశలో తెలుగులో సార్ సినిమాలో విలన్ అంటే ప్రకాష్ రాజ్ అనేలా అవకాశాలు అందుకున్నారు. ఒకప్పుడు కేవలం విలన్ గా మాత్రమే చేసే ప్రకాష్ రాజ్ ఇప్పుడు సపోర్టింగ్ రోల్స్ చేస్తూ వస్తున్నారు. సినిమాను టర్న్ చేసే పాత్ర అది ఎంత చిన్నదైనా అది చేసేందుకు రెడీ అంటారు ప్రకాష్ రాజ్.

 

కేవలం నటుడిగానే కాదు దర్శకుడిగా, నిర్మాతగా కూడా ప్రకాష్ రాజ్ తన ప్రతిభ చూపించారు. ఐదు సినిమాలకు దర్శకత్వం వహించిన ప్రకాష్ రాజ్ ఆరు సినిమాల దాకా నిర్మించారు. సినిమాల్లో విలన్ గా కనిపించినా రియల్ లైఫ్ లో ప్రకాష్ రాజ్ డి చాలా మంచి మనసు. ఎలాంటి ఆపద వచ్చినా ప్రజలకు సహాయం చేయడంలో ముందుంటాడు ప్రకాష్ రాజ్. జస్ట్ అస్కింగ్ అంటూ రాజకీయ నేతలను ప్రశ్నిస్తున్నారు. స్మాల్ స్క్రీన్ లో ఒక చిన్న పాత్రతో మొదలు పెట్టిన ఆయన నట జీవితం అయన ప్రతిభ వల్ల ఇంత గొప్ప స్థాయిలో ఉండగలిగారు. రెండు దశాబ్దాలుగా హీరోలు కాకుండా ఒకే రకమైన క్రేజ్ కొనసాగిస్తున్న నటులలో ఎవరంటే అది ప్రకాష్ రాజ్ మాత్రమే అని చెప్పొచ్చు. 

మరింత సమాచారం తెలుసుకోండి: