టాలీవుడ్, కోలీవుడ్, బాలీవుడ్ లో సంచలన తారగా గుర్తింపు తెచ్చుకుంది రాధికా ఆప్టే.  నటించింది కొన్ని సినిమాలే అయినా ప్రతి సినిమాలో తన ప్రత్యేక చాటుకుంది.  స్టార్ హీరోలు బాలకృష్ణతో లెజెండ్ లో నటించి మంచి గుర్తింపు తెచ్చుకుంది.  రాధికా ఆప్టే అంటే కేవ‌లం న‌టిగా మాత్ర‌మే కాదు.. ఎప్ప‌టిక‌ప్పుడు కాంట్రవ‌ర్సీల్లో నిలిచే పేరుగా కూడా గుర్తుకొస్తుంది. ఇప్పుడు కూడా ఇదే జ‌రిగింది. ఈమె ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాలతో బిజీగా ఉంది.  తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో ముఖానికి మాస్క్ వేసుకొని ఉన్న ఫోటోని షేర్ చేస్తూ.. హాస్పిట‌ల్‌లో ఉన్నాన‌ని కామెంట్ పెట్టింది.

 

ఈ స‌మ‌యంలో రాధికా హాస్పిట‌ల్‌కి వెళ్లిందంటే క‌రోనా సోకిఉంటుందా అనే అనుమానాన్ని జ‌నాలు వ్య‌క్తం చేస్తార‌ని ముందే ఊహించిన ఈ అమ్మ‌డు కొన్ని హ్యాష్ ట్యాగ్స్ జ‌త చేసింది. బ‌య‌ప‌డాల్సిన అవ‌స‌రం లేదు.  రాధికా ఆప్టే తాను కరోనా పరీక్షలు  చేయించు కోలేదని తెలిపింది. తనకు కరోనా లక్షణాలేవీ లేవని, పూర్తి ఆరోగ్యంగా ఉన్నానని స్పష్టం చేసింది. తాను ఆసుపత్రికి వచ్చానని, అయితే, కరోనా పరీక్షల కోసం కాదని తెలిపింది. తన ఆరోగ్యంపై ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, అంతా బాగానే ఉందని హాష్ ట్యాగ్స్ జత చేసింది. ఇంట్లోనే ఉండి, భద్రంగా ఉండాలని సూచించింది.   

 

రాధికా ఆప్టే పోస్ట్‌పై స్పందించిన గ‌ల్లీబాయ్ న‌టుడు విజ‌య్ వ‌ర్మ‌.. ఓమై గాడ్.. టేక్ కేర్ డియ‌ర్.. గాడ్ బ్లెస్ యూ అని కామెంట్ పెట్టాడు. అయితే రాధికా ఆప్టే ఈ స‌మ‌యంలో ఆసుపత్రికి పోవ‌ల‌సిన అవ‌స‌రం ఏమోచ్చింద‌ని అభిమానులు ముచ్చ‌టించుకుంటున్నారు.  ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా కరోనా కేసులు రోజు రోజుకీ పెరిగిపోతున్న విషయం తెలిసిందే.  ఈ నేపథ్యంలో సినీ నటులు కూడా ప్రతి ఒక్కరికీ జాగ్రత్తలు సూచిస్తున్నారు.  తాజాగా కరోనా భూతాన్ని ప్రారదోలేందుకు లాక్ డౌన్ చేస్తున్న విషయం తెలిసిందే. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: