కోవిడ్-19 వైరస్ వల్ల ప్రపంచం మొత్తం అల్లాడిపోతోంది. మన దేశమంతా లాక్ డౌన్ ప్రకటించడం వల్ల, అందరూ ఇళ్లకే పరిమితమయ్యారు. దీని వల్ల సినెమా షూటింగ్లు, సీరియల్ షూటింగ్లు, కామెడీ షోలు.. ఇలా అన్నీ ఆగిపోయాయి. దాంతో అర్దిస్తుల పరీస్థితి అయోమయంలో పడిపోయింది. ముఖ్యంగా ప్రముఖ కామెడీ షో జబర్దస్త్ పై దీని ప్రభావం ఎక్కువగా ఉంది. ముఖ్యంగా ఈ షోకు జడ్జిగా వ్యవహరించే రోజా కూడా నిన్నటి ఎక్స్ ట్రా జబర్దస్త్ ఎపిసోడ్ లో కనిపించలేదు. ఆమె స్థానంలో శేఖర్ మాస్టర్ జడ్జిగా వ్యవహరించారు. రోజా స్టే హోంలో భాగంగా ఇంటికే పరిమితం అయ్యారని, అందుకే జబర్దస్త్ షూటింగ్ కు రాలేదని తెలుస్తోంది. పైగా ఇప్పుడు జబర్డస్త్ కొత్త ఎపిసోడ్స్ షూటింగ్ కూడా నిలిపివేశారు.

 

ఈ లాక్ డౌన్ కారణంగా ఆర్టిస్టులందరూ ఇళ్లల్లోనే ఉండిపోయారు. ఒక వైపు కొత్త ఎపిసోడ్ షూటింగ్స్ ఆగిపోయాయి. ఇంకో వైపు ఇంట్లో నుండి బయటకు వెళ్ళడానికి లేదు. దీంతో వారికి ఎం చేయాలో అర్థం కావడంలేదు. షూటింగ్స్ లేకపోవడం వల్ల సుధీర్, రష్మీ, అనసూయ, ఆది వంటి పెద్ద ఆర్టిస్టులకు ఆర్థిక ఇబ్బందులు ఉండకపోవచ్చు. కానీ చిన్న చిన్న ఆర్టిస్టులకు మాత్రం ఇది పెద్ద సమస్యగా మారింది. రోజూ వారీ వేతనం తీసుకుని పని చేసేవారు. ఇప్పుడు ఆదాయం లేక ఇబ్బందులు పడుతున్నారు. కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలో తెలియక మదనపడుతున్నారు. తమ గురించి యాజమాన్యం కాస్త ఆలోచిస్తే బాగుంటుందని వారు అభిప్రాయపడుతున్నారు. మరి వారు వీరికి ఏ విధంగా సహాయం చేస్తారో చూడాలి మరి.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple: https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: