మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన హీరో మంచు విష్ణు. 'ఢీ', 'దేనికైనా రెడీ', దూసుకెళ్తా చిత్రాల ద్వారా మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. మంచు విష్ణు ప్రస్తుతం భారీ ఐటీ స్కాం నేపథ్యంలో రూపొందుతున్న 'మోసగాళ్లు' అనే పాన్ ఇండియా మూవీలో నటిస్తున్న విషయం తెలిసిందే. ఈ చిత్రంలో బాలీవుడ్ యాక్టర్ సునీల్ శెట్టి, కాజల్ అగర్వాల్ ప్రధాన పాత్రలు పోషిస్తున్నారు. ఇదిలా ఉండగా విష్ణు ఈ మధ్య ఒక ఛానల్ కి ఇచ్చిన ఇంటర్వ్యూలో కొన్ని ఆసక్తికరమైన అంశాలను బయటపెట్టాడు. తెలుగు ఇండస్ట్రీలో మంచు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి ఉండే గొడవలు అందరికి తెలిసిందే. సినీ పరిశ్రమ వజ్రోత్సవాలు సమయంలో, చిరంజీవికి పద్మ భూషణ్ ఇచ్చిన సందర్భంగా ఆయన్ని సన్మానించిన వేడుకల్లో వీరి ఇరువురి మధ్య వ్యాఖ్యలు అప్పట్లో ఎంత దుమారాన్ని రేపాయో తెలిసిందే. ఈ ఘటనలు తెలుగు సినీ ఇండస్ట్రీలో పెద్ద గొడవల్లో ఒకటిగా నిలిచిపోయాయి. అందుకే నేటికీ వీటి గురించి చెప్పుకుంటూ ఉంటారు. అప్పటి నుండి వీరి మధ్య కోల్డ్ వార్ నడుస్తూనే ఉండేది.

 

కానీ ఈ మధ్య వీరి మధ్య ఇగో ప్రాబ్లమ్స్ తొలగిపోయి మంచి స్నేహితుల్లా మెలుగుతున్నారు. ఇప్పుడు ఎన్నో వేడుకలకు కలిసి హాజరై ఆప్యాయంగా పలకరించుకుంటూ ఉంటున్నారు. రీసెంటుగా మంజు మనోజ్ చిత్ర షూటింగ్ ప్రారంభానికి రామ్ చరణ్ గెస్ట్ గా వెళ్లిన విషయం తెలిసిందే. అంతేకాకుండా సోషల్ మీడియాలోకి ఎంటర్ అయిన చిరంజీవికి స్వాగతం పలికిన మోహన్ బాబుకి ఫన్నీ వేలో 'రాననుకున్నావా రాలేవనుకున్నావా' అంటూ రిప్లై ఇచ్చి వాళ్ల మధ్య మంచి రేలషన్ ఉందని మరోసారి స్పష్టం చేసారు. చిరంజీవి మోహన్ బాబులు ఇద్దరూ స్నేహితులుగా మారినా ఆ రెండు ఇన్సిడెంట్స్ తాలూకు జ్ఞాపకాలు మాత్రం ఆ ఫ్యామిలీలను వదిలేలా లేవు.

 

లేటెస్టుగా మంచు విష్ణు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో ఈ విషయాన్ని యాంకర్ ప్రస్తావించారు. అప్పట్లో పవన్ కళ్యాణ్ అలా ఎందుకు మాట్లాడారని అడుగగా 'పవన్ కళ్యాణ్ అప్పుడు ఎందుకు అలా మాట్లాడారో నాకు తెలియదని, అనవసరంగా ఓవర్ రియాక్టయ్యాడని, బహుశా ఆయన్ని అడిగితేనే దీనికి సమాధానం దొరుకుతుందని, నాకు తెలిసి ఆ రోజు మా నాన్న గారు అంతగా ఏమి మాట్లాడలేదని, వాళ్లిద్దరూ కొన్ని సంవత్సరాల నుండి కలిసి మెలిసి ఉంటున్నారని' సమాధానమిచ్చాడు. అంతేకాకుండా ఈ పొజిషన్ కి రావడానికి వాళ్లు ఎంతో స్ట్రగుల్ అయ్యారు, ఈ జనరేషన్ హీరోలు కూడా చిరంజీవి మోహన్ బాబులని ఆదర్శంగా తీసుకోవాలని, నేను ఈ జనరేషన్ హీరోలతో మంచి రిలేషన్షిప్ మెయింటైన్ చేస్తున్నానని ఈ సందర్భంగా తెలియజేసారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: