టాలీవుడ్ నటుడు సూపర్ స్టార్ మహేష్, ప్రస్తుతం కరోనా ఎఫెక్ట్ నేపథ్యంలో తన కుటుంబంతో కలిసి ఇంటికే పరిమితం అయ్యారు. ఇక మరోవైపు తనతో తోపాటు కూతురు సితారతో కూడా కరోనా మహమ్మారి బారిన పడకుండా ఈ విధంగా జాగ్రత్తలు పాటించాలి అంటూ కొన్ని సూత్రాలను ప్రజలకు, ఫ్యాన్స్ కు తన సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా అందిస్తున్నారు సూపర్ స్టార్ మహేష్. అయితే ఈ మహమ్మారి నేపథ్యంలో మన దేశంలో రాబోయే ఏప్రిల్ నెల 15 వరకు మొత్తంగా 21 రోజుల పాటు ప్రజలందరూ లాకౌట్ వలన పూర్తిగా ఇళ్లకే పరిమితం అవ్వాల్సి రావడంతో, పలు మధ్య, దిగువ తరగతి వర్గాల వారి ఆదాయం పూర్తిగా పడిపోవడం, తద్వారా వారి పోషణ కష్టం అయింది. 

 

అయితే అది గ్రహించిన మన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత మొత్తాన్ని ఆర్ధిక సాయంగా పేద వర్గాల వారికి ప్యాకెజీ ప్రకటించడం జరిగింది. అయితే టాలీవుడ్ సినిమా పరిశ్రమకు చెందిన సినిమా ప్రముఖులు కూడా ఇప్పటివరకు తమ గొప్ప మనసుతో ఎవరికి వారు తమకు వీలైన సాయాన్ని చేయసాగారు. ఇక ఇప్పటికే ఆంధ్ర, తెలంగాణ సీఎం రిలీఫ్ ఫండ్స్ కు రూ. 50 లక్షల చొప్పున మొత్తం రూ.1 కోటి రూపాయల విరాళం ప్రకటించిన సూపర్ స్టార్ మహేష్, నేడు కాసేపటి క్రితం రోజువారీ సినిమా కార్మికుల వేతనాల కోసం రూ.25 లక్షల విరాళాన్ని ప్రకటించి మరొక్కసారి తన ఉదారతను చాటుకున్నారు. 

 

తండ్రి సూపర్ స్టార్ కృష్ణ గారి వలె మహేష్ కూడా ఎప్పుడూ తనవంతుగా ఇటువంటి విపత్కర సమయాల్లో సాయం అందించడానికి ముందు ఉంటారని, సూపర్ స్టార్ గా రాబోయే రోజుల్లో ఆయా మరిన్ని విజయాలు అందుకుని ఉన్నత శిఖరాలు చేరాలని పలువురు ప్రేక్షకులు, అభిమానులు మహేష్ బాబు మంచి మనసుపై పొగడ్తలు కురిపిస్తున్నారు. కాగా మిగతా నటీనటులు కూడా మరింతగా ముందుకు వచ్చి వీలైనంత సాయం అందిస్తే పేదవారికి అది ఎంతో ఉపయోగకారిగా ఉంటుందని మహేష్, కాసేపటి క్రితం తన సోషల్ మీడియా మాధ్యమం ట్విట్టర్ ద్వారా పోస్ట్ చేస్తూ తెలిపారు...!!

మరింత సమాచారం తెలుసుకోండి: