దర్శకధీరుడు రాజమౌళి రూపొందిస్తున్న 'ఆర్.ఆర్.ఆర్' సినిమా టైటిల్ మోషన్ పోస్టర్ ఉగాది కానుకగా రిలీజయింది. ఎన్టీఆర్, రామ్ చరణ్ కలిసి నటిస్తున్న ఈ మల్టీస్టారర్ మూవీ టైటిల్ గా 'రౌద్రం రణం రుధిరం' ఫిక్స్ చేశారు. టైటిల్ మాత్రమే కాదు ఈ టైటిల్ కు తగినట్టుగా అల్లూరి సీతారామరాజు రౌద్రం చూపిస్తూ నిప్పు కనికగా రామ్ చరణ్ పరుగెత్తుకు వస్తుండగా.. నీటితో రుధిరం అంటూ ఎన్టీఆర్ కనిపించాడు. ఈ ఇద్దరు చేసే రణంగా ఆర్.ఆర్.ఆర్ వస్తుంది. కరోనా వైరస్ కారణంగా ప్రజలంతా ఇళ్ళలోకే పరిమితమై పనులేమీ లేక ఒక విధమైన నిరాశగా ఉన్న సమయంలో రాజమౌళి ఆర్.ఆర్.ఆర్ టైటిల్ లోగోని వదిలి ఒకింత ఆశలు రేపాడు.

 

అంతేకాకుండా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేసిన విషయం తెలిసిందే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తున్నది. ఎంతో కాలంగా 'సీతారామరాజు' అప్డేట్ కోసం వెయిట్ చేస్తున్న రామ్ చరణ్ అభిమానులకు ఈ వీడియో ఎడారిలో ఒయాసిస్సులా కనిపించింది. ఈ వీడియోలో రామ్ చరణ్ ని చూసిన సగటు సినీ అభిమాని ఔరా అనక మానడు. ఇంక ఫ్యాన్స్ విషయానికొస్తే వాళ్ళు పండగ చేసుకుంటున్నారు అనే చెప్పవచ్చు. అయితే రామ్ చరణ్ ఫ్యాన్స్ పండగ చేసుకుంటున్నారు సరే, మరి ఎన్టీఆర్ అభిమానుల సంగతి. ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే చర్చ జరుగుతోంది. అయితే ఎన్టీఆర్ వీడియోకి సంబంధించి ఒక ఆసక్తికరమైన న్యూస్ బయటకి వచ్చింది.

 

వివరాల్లోకి వెళ్తే వచ్చే నెల అనగా మే 20వ తేదీన ఎన్టీఆర్ వీడియో రానున్నదని సమాచారం. ఆ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్టుగా రామ్ చరణ్ కూడా ఒక స్పెషల్ వీడియో రెడీ చేపిస్తున్నాడని విశ్వసనీయ వర్గాల సమాచారం. 'రామ్ ఫర్ భీమ్' అన్నమాట. ఇప్పటికే విడుదలైన వీడియోలో ఎన్టీఆర్ వాయిస్ ఓవర్ గురించి అన్ని ఇండస్ట్రీలలో మాట్లాడుకుంటున్నారు. మరి రాబోయే 'కొమరం భీమ్' వీడియోలో ఎన్టీఆర్ ఎలా ఉండబోతున్నాడో అంటూ అభిమానులు ఇప్పటి నుండే ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. ఏదేమైనా ఆ స్పెషల్ వీడియో కోసం మే 20 వరకు వెయిట్ చేయక తప్పదు

మరింత సమాచారం తెలుసుకోండి: