ముఠామేస్త్రీ సినిమా రిలీజ్ అయింది. ఎంతటి పెద్ద హిట్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ మూవీ తరువాతనే చిరంజీవి రాజకీయ ప్రవేశంపైన ఎన్నో ఊహాగానాలు వచ్చాయి. చిరంజీవి ఆ మూవీలో మంత్రిగా కనిపిస్తారు. చిరంజీవి కెరీర్ మంచి పీక్ లో ఉన్నపుడు డిఫరెంట్ టైప్ లో ఒక పొలిటికల్ స్టోరీగా చిరు చేసి ఆడియన్స్ ని మంచి వినోదం పంచారు.

 

ఇదిలా ఉండగా చిరంజీవి వెండితెరపైన ముఠా మేస్రీ అయితే నిజ జీవితంలో ముఠా మేస్త్రీ బిరుదు మాత్రం దర్శకరత్న దాసరి నారాయణరావుకే దక్కింది. ఆయన ముఖ్యంగా తెలుగు సినీ కార్మికుల కోసం బాగా క్రుషి చేశారు.  అర్ధరాత్రి తలుపు కొట్టినా కూడా తీసి కార్మికుల సమస్యలు వినేందుకు ఆయన  రెడీగా ఉండేవారు.

 

దాసరి పోయి చాలా కాలం అయింది. సినీ కార్మికుల సమస్యలు విని ఆదుకునేందుకు సరైన నాయకత్వం ఇంకా రాలేదు. ఇపుడు కరోనా వైరస్ వచ్చింది. దాంతో హీరోల వరకూ బాగానే ఉన్నా సినీ కార్మికులు బాగా ఇబ్బందులు పడుతున్నారు. వారిని ఆదుకునేందుకు హీరోలు అందరూ తమకు తోచిన సాయం చేస్తున్నారు.

 

అయితే వారికి అండా దండా ఉండే నాయకుడు కావాలన్న డిమాండ్ మళ్ళీ పుట్టుకొస్తోంది. మెజారిటీ సినీ తారలు మాత్రం చిరంజీవి వైపే చూస్తున్నారు. ఆయన అందరి వాడు కాబట్టి ఈ క్లిష్టమైన వేళ నాయకత్వం వహించి సినీ కార్మికుల జీవితాల్లో వెలుగు నింపాలని కోరుతున్నారు. మరి చిరు రెడీ అంటే ఈసారి నిజ జీవితంతో ఆయన ముఠామేస్త్రీ అయినట్లే.

 

ఇదిలా ఉండగా ఇప్పటికే చిరంజీవి అందరికీ పెద్దన్నలా వ్యవహరిస్తున్నారు. అన్ని రకాల సినీ ఫంక్షన్లకు హాజరవుతూ తన పెద్దరికాన్ని నిలబెట్టుకుంటున్నారు. ఓ విధంగా టాలీవుడ్ కి ఆయనే పెద్ద దిక్కు అన్న వారు ఉన్నారు. అలాంటి చిరంజీవి ఈ కష్టకాలంలో కార్మికుల బంధువుగా మారితే ఆనందించేవారే అంతా ఉంటారు.

మరింత సమాచారం తెలుసుకోండి: