తెలుగువారికి అతడు అల్లు అర్జున్, కేరళ కుట్టీలకు అతగాడు మల్లు అర్జున్. అందరి ప్రేక్షకులకు అతడు స్టైల్ స్టార్.. అవును. అతని 17 ఏళ్ళ సినీ ప్రస్థానం పరిశీలించినట్లైతే.. హీరోగా కంటే, కూడా.. ఒక నటుడిగా అర్జున్ ఎదిగిన తీరు నా భూతో న భవిశ్యతి. మెగా ఫ్యామిలీకి సంబంధిన వ్యక్తి అయినప్పటికీ, వారి సపోర్ట్ లేకుండా ఇండస్ట్రీలో ఎదిగిన తీరు ప్రతి ఒక్కరికీ స్ఫూర్తి దాయకం.

 

 

బేసిగ్గా, మన తెలుగు హీరోలకు మన దగ్గర కాకుండా, మరే ఇతర భాషల్లోనూ అంత గుర్తింపు లేదంటే.. నమ్మి తీరాలి. అలాంటిది కేరళ ఆడియన్స్, మన అల్లు గారి అబ్బాయిని వాళ్ళ హీరోలతో సమానంగా భావిస్తున్నారంటే... అది అతని ప్రతిభకి తార్కాణం అని చెప్పుకోవాలి. ఇక అతని సినీ ప్రస్థానం గురించి అందరికి విదితమే. హీరోగా నేటికి అల్లు అర్జున్‌కు పదిహేడేళ్లు పూర్తైన నేపథ్యంలో ఓ ఎమోషనల్ ట్వీట్ చేశాడు. 

 

ఆది నుండి ఇప్పటివరకు తన జీవితంలో అతనికి ఉపకరించిన ప్రముఖులకు ఈ సందర్భంగా కృతజ్ఞతలు తెలియజేసాడు మన అల్లు అర్జున్. అలాగే... ఈ సినీ ప్రయాణంలో అతనికి అండగా నిలిచిన ప్రేక్షక దేవుళ్ళకు ధన్యవాదాలు తెలిపాడు. ఇక అల్లు అర్జున్ ఎదిగిన తీరు అందరికి విదితమే. మొదటి చిత్రం గంగోత్రి చూసిన 99 శాతం ప్రేక్షకులు అతగాడిది హీరో ఫిగర్ కాదని విమర్శలు గుప్పించారు. కానీ, ఆర్య అనే చిత్రంతో అల్లు అర్జున్ ఇచ్చిన మేకోవర్ సదరు విమర్శకులకు చెంప దెబ్బ అయింది.

 

 

11 ఏప్రిల్ 2014 లో వచ్చిన రేసుగుర్రంలో అర్జున్ నటన ఒక్కసారిగా అతని కెపాసిటీని తెలియజేసింది. అందులో ప్రతినాయకుడు రవి కిషన్ కు ధీటుగా నటించి, ఒక నటుడిగా అయన ప్రూవ్ చేసుకున్నారు. ఇక తరువాత ఎన్నో సూపర్ హిట్స్, బ్లాక్ బస్టర్స్ ఇచ్చి, సినీ కళామ తల్లి ఋణం తీర్చుకున్నాడు. ఇక ఇటీవల విడుదలయ్యిన "అల వైకుంఠపురములో" చిత్రంతో, ఇండస్ట్రీ రికార్డులు నెలకొల్పి... చరిత్ర సృష్టించాడు. అతని ట్వీట్ కు ప్రతిగా... అతనితో పనిచేసిన సదరు క్రూ, బన్నీ మరింత సక్సెస్ కావాలని, మరిన్ని రికార్డులు నెలకొల్పాలని మనః పూర్వకంగా కోరుకున్నారు.

మరింత సమాచారం తెలుసుకోండి: