కరోనా మహమ్మారి నుంచి తమను తాము కాపాడుకోవాలని సెలబ్రిటీల నుంచి ప్రధాని వరకూ అందరూ జాగ్రత్తలు చెప్తున్నారు. ఈ మహమ్మారిని తరిమికొట్టేందుకు ప్రభుత్వం అనేక చర్యలు తీసుకుంటోంది. మన తెలుగు సిని హీరోలు మరో ముందడుగు వేసి ప్రభుత్వాలకు విరాళాలు ఇస్తూ తమ వంతు సాయం చేస్తున్నారు. ఇక చిరంజీవి, సురేశ్ ప్రొడక్షన్స్, అక్కినేని ఫ్యామిలీ, మహేశ్, ఎన్టీఆర్ వంటి వారు సినీ పరిశ్రమలోని కార్మికులకు ఆర్ధికంగా ఆదుకునేందుకు భారీ విరాళాలు ప్రకటించి శెభాష్ అనిపించుకుంటున్నారు.

 

 

అయితే.. మన టాలీవుడ్ హీరోలతో పోలిస్తే బాలీవుడ్ హీరోలు, కోలీవుడ్ హీరోలు చాలా తక్కువ స్ధాయిలో ప్రతిస్పందించారనే చెప్పాలి. ఇండియన్ సినిమా అంటే మేమే అని చెప్పుకునే బాలీవుడ్ ఖాన్ త్రయం.. అమీర్, సల్మాన్, షారుఖ్ ఖాన్లు మాత్రం ఇంకా రూపాయి విదల్చలేదనే చెప్పాలి. తమకు ఎంతో ఇంపార్టెన్స్ ఇచ్చే ప్రధాని సహాయ నిధికి కూడా వారు ఇంతవరకూ ఎటువంటి విరాళం ప్రకటించలేదు. దీనిపై నెట్టింట్లో తీవ్ర విమర్శలు వస్తున్నాయి. తెలుగు సినిమా హీరోలను చూసి నేర్చుకోవాలని పలువురు నెటిజన్లు బాలీవుడ్ హీరోలకు, హీరోయిన్లకు కౌంటర్లు వేస్తున్నారు. అక్షయ్ కుమార్ మాత్రమే భారీ విరాళం ప్రకటించడం.. హృతిక్ కొంత సాయం చేయడం మినహా పెద్దగా స్పందన లేదు.

 

 

తమిళ హీరోలు కూడా తమ సినీ కార్మికులకు విరాళాలు ప్రకటించినా తెలుగు హీరోలతో పోల్చితే చాలా దిగువస్థాయిలో ఉన్నారు. తమిళ కార్మికులకు రజినీ 50లక్షలు ఇస్తే తెలుగు కార్మికులకు చిరంజీవి, నాగార్జున, సురేశ్ ప్రొడక్షన్స్ చెరో 1కోటి రూపాయలు ఇవ్వడమే ఇందుకు ఉదాహరణ. విపత్కర పరిస్థితుల్లో తమ సాయం, స్పందన ఏస్థాయిలో ఉంటుందో టాలీవుడ్ హీరోలు నిరూపిస్తున్నారు. తెలుగు హీరోలతో పోలిస్తే బాలీవుడ్ హీరోల స్పందనకు, తమిళ హీరోల స్పందనకు తేడాను పలువురు గుర్తిస్తే అదే సంతోషం.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: