ఈ కాలం ఎలాంటిది అండి? అసలు ఈ కాలంలో అందాల ఆరబోత చేయకుంటే అసలు అవకాశాలు ఇస్తారా? అసలు చూస్తారా? అంటే చూడరు.. అవకాశాలు ఇవ్వరు అనే చెప్పాలి. ఎందుకంటే ఈ కాలంలో సినిమాలో కథ ఉన్న లేకున్నా అందాల ఆరబోత ఉండాలి. లేదు అంటే అసలు చూడరు.. అలా మారింది కాలం. 

 

ఇంకా అలాంటి ఈ కాలంలో ఓ తార అందాల అరోబోత చెయ్యమంటే చెయ్యనే చెయ్యను అనింది. అంతేకాదు.. అందాల ఆరబోత చేయకపోగా గతంలోకి వెళ్లి వచ్చింది.. ఆ నటి బయో పిక్ లో నటించింది. నిజం చెప్పాలి అంటే మహానటిలా నటించింది. ఇంకా ఊరికే ఉంటారా? అందరూ ఈవిడ ఓల్డ్ నటి అనే అనుకున్నారు.. 

 

నిజానికి ఆమె పాత్రలో నటించలేదు.. జీవించింది.. అందరికి నచ్చింది.. ఆ సినిమా సూపర్ హిట్ అయ్యింది. కానీ అవకాశాలు రాలేదు.. ఆ సినిమా తర్వాత ఎక్కడో ఒక చోట.. రెండు చోట్లా కనిపించింది ఈ భామ. అలాంటి ఈ భామకు ఆ మహానటి నటన ఉన్న అవకాశాలు మాత్రం తక్కువ అయిపోయాయి.. ఎందుకంటే ఈ కీర్తి సురేష్ పాప అంత మంచి నటి అయినప్పటికీ అవకాశాలు రాలేదు .. 

 

ఎందుకంటే ఈ భామ అందాల ఆరబోత చెయ్యను అనింది అంట.. అందుకే అవకాశాలు తగ్గాయి అంట.. అందుకే తెలుగు తెరకు చాల దూరం అయిపోయింది ఈ భామ.. నటన ఉన్నప్పటికీ.. అందాల ఆరబోత చేయకపోవడంతో తెలుగు తెరకు దూరం అయ్యింది అని టాక్. ఈ కామెంట్లు సోషల్ మీడియాలో కూడా అప్పట్లో ఓ రేంజ్ వైరల్ అయ్యాయి. ఏది ఏమైనా అందం ఉన్న భామ కాబట్టి సినిమాకు తగ్గట్టు చేసి ఉంటె ఈరోజు అందరికి కనిపించేది.                   

మరింత సమాచారం తెలుసుకోండి: