టాలీవుడ్ సినిమా పరిశ్రమకు ముందుగా అసిస్టెంట్ డైరెక్టర్ గా అడుగుపెట్టిన నాచురల్ స్టార్ నాని, ఆ తరువాత మెల్లగా తన యాక్టింగ్ టాలెంట్ తో తొలిసారిగా ఇంద్రగంటి మోహన కృష్ణ దర్శకత్వంలో వచ్చిన అష్టా చమ్మా సినిమా ద్వారా హీరోగా అడుగుపెట్టారు. అయితే హీరోగా నటించిన ఫస్ట్ సినిమాతోనే మంచి హిట్ కొట్టిన నాని, అక్కడినుండి మెల్లగా ఒక్కొక్కటిగా అవకాశాలు అందుకుంటూ ముందుకు సాగారు. ఇక ఇటీవల వరుసగా మంచి విజయాలు అందుకుంటూ ముందుకు సాగుతున్న నానికి కొన్నాళ్ల క్రితం వచ్చిన గ్యాంగ్ లీడర్ సినిమా మాత్రం పెద్దగా సక్సెస్ ని అందించలేకపోయింది. 

 

అయితే అంతకముందు ఆయన నటించిన జెర్సీ సినిమా మంచి విజయాన్ని అందుకోవడంతో పాటు పలువురు ప్రేక్షకుల మనసు గెలిచింది. ఆ సినిమాలో నాని నటనకు ప్రేక్షకుల నుండి మంచి మార్కులే పడ్డాయి. ఇక నేడు కాసేపటి క్రితం ప్రతి ఏడాది ప్రకటించే ఫిలిం క్రిటిక్స్ ఛాయస్ అవార్డ్స్ లో భాగంగా గత ఏడాదికి సంబందించిన అవార్డులను ప్రకటించడం జరిగింది. జెర్సీ సినిమాలో అద్భుత నటన కనబరిచినందకు గాను నానికి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కగా, ఓ బేబీ సినిమాలో తన ఆకట్టుకునే నటనతో మంచి పేరు దక్కించుకున్న అక్కినేని సమంత ఉత్తమ నటిగా అవార్డు దక్కించుకున్నారు. 

 

ఉత్తమ చిత్రంగా ప్రియదర్శి ప్రధాన పాత్రలో చింతక్రింది మల్లేశం జీవితగాథ ఆధారంగా రూపొందిన మల్లేశం, ఉత్తమ దర్శకుడిగా జెర్సీ సినిమా దర్శకుడు గౌతమ్ తిన్ననూరి, ఉత్తమ రచయితగా బ్రోచేవారెవరురా సినిమా దర్శకుడు వివేక్ ఆత్రేయ అవార్డులు దక్కించుకున్నారు. మంచి ఎమోషనల్ డ్రామాగా సాగిన జెర్సీ  మూవీలో, మధ్యవయస్కుడైనప్పటికీ కూడా క్రికెట్ ఆట పట్ల మక్కువతో జట్టులో చోటు దక్కించుకున్న హీరో తన గోల్ ని రీచ్ అయిన తరువాత హఠాత్తుగా మరణిస్తాడు. ఎంతో హృద్యంగా సాగిన ఈ సినిమాలో నాని సరసన శ్రద్ధ శ్రీనాథ్ హీరోయిన్ గా నటించింది. ఇక నానికి ఉత్తమ నటుడిగా అవార్డు దక్కడంతో ఆయన ఫ్యాన్స్ అప్పుడే ఆనందంతో సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా ఆయనకు శుభాభినందనలు తెలియచేయడం మొదలెట్టేశారు....!!

మరింత సమాచారం తెలుసుకోండి: