ప్రపంచ వ్యాప్తంగా కరోనా విజృంభిస్తున్న నేపథ్యంలో దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ చేసిన విషయం తెలిసిందే. అయితే దీని వలన ప్రజలందరూ ఎటువంటి పనులు లేక ఇంటికే పూర్తిగా పరిమితం కావాల్సి వచ్చింది, దానితో ఇల్లు గడిచే పరిస్థితి లేక పేద, దిగువ మధ్యతరగతి కుటుంబాల వారు తీవ్ర సమస్యలు ఎదుర్కొంటున్నారు. తెలుగు రాష్ట్రాల్లో ఎలాంటి విపత్తు వచ్చినా టాలీవుడ్ చిత్ర పరిశ్రమ సహాయం చేయడానికి ఎప్పుడూ ముందుంటుంది. హీరోలు దర్శక నిర్మాతలు తమ వంతుగా కష్టాల్లో ఉన్నవారిని ఆదుకునేందుకు తమ వంతు సాయం చేస్తున్నారు. కరోనా వైరస్ బాధితుల సహాయార్థం తెలుగు సినిమా ఇండస్ట్రీ నుంచి ఒక్కొక్కరుగా భారీ విరాళాలు అందిస్తున్నారు. కరోనాపై పోరాటానికి నాంది పలికిన తెలుగు సినిమా హీరో నితిన్ తో మొదలైన ఆర్థిక సాయం ఇప్పుడు ఊపందుకుంది.

 

మెగాస్టార్ చిరంజీవి, వెంకటేష్, సూపర్ స్టార్ మహేష్ బాబు, ప్రభాస్, ఎన్టీఆర్, పవన్ కళ్యాణ్, రామ్ చరణ్, మంచు మనోజ్, రాజశేఖర్, అల్లరి నరేష్, దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్, కొరటాల శివ, వి.వి.వినాయక్, అనిల్ రావిపూడి, కొరటాల, సుకుమార్ వంటి వారు ముందుకు వచ్చి తమ వంతుగా విరాళాలు అందించడం జరిగింది. ఇప్పుడు తాజాగా ఈ లిస్టులో అక్కినేని నాగార్జున, నాగచైతన్య కూడా చేరారు. కరోనా మహమ్మారితో ఒక్కసారిగా ఉపాధి కోల్పోయిన తెలుగు సినీ కార్మికుల సంక్షేమం కోసం అక్కినేని నాగ చైతన్య 25 లక్షల రూపాయలు, నాగార్జున కోటి రూపాయలు విరాళాన్ని ప్రకటించి వారి బాధ్యతను నెరవేర్చారు. దీంతో ఇండస్ట్రీలో దాదాపు అందరూ తమకు తోచిన సహాయం చేసారు. 

 

కానీ ఒక్క యువ హీరో మాత్రం ముందుకు రావడం లేదని ఇప్పుడు అందరు చర్చించుకుంటున్నారు. అతనే విజయ దేవరకొండ. అందరూ స్పందిస్తున్నా తమ అభిమాన హీరో సైలెంటుగా ఉండటం విజయ్ ఫ్యాన్స్ కి నచ్చడం లేదంట. ఈ విషయాన్ని విజయ్ అభిమానులు సోషల్ మీడియా ద్వారా తెలియజేస్తున్నారు. ఈ విషయం విజయ్ దాకా చేరి రాబోయే రోజుల్లో స్పందిస్తాడేమో చూడాలి. వాస్తవానికి కరోనా ఇంత తీవ్ర ప్రభావాన్ని చూపకముందే కరోనా వ్యాప్తి నివారణకు తీసుకోవలసిన జాగ్రత్తలపై విజయ్ దేవరకొండ వీడియో రూపంలో అవేర్నెస్ కలిగించాడు. 

మరింత సమాచారం తెలుసుకోండి: