క‌రోనా వైర‌స్‌తో ప్ర‌పంచ వ్యాప్తంగా అంద‌రూ ఇబ్బంది ప‌డుతున్న విష‌యం తెలిసిందే. అయితే ఈ వ్యాధి అంటువ్యాధి కావ‌డంతో చాలా తేలిక‌గా ఇది అంద‌రికి సోకుంతుంద‌న్న విష‌యం తెలిసిందే. దీంతో ప్ర‌పంచ‌మంతా కూడా మృత్యువాత ప‌డుతుంది. ఇక రెండు తెలుగు రాష్ట్ర ప్ర‌భుత్వాలు దీని పై త‌గిన చ‌ర్య‌లు తీసుకుంటున్నారు. ఇక ప్ర‌పంచ‌మంతా క‌డూఆ  లాక్‌డౌన్ ప్ర‌క‌టించ‌డంతో అంద‌రూ కూడా ఎవ‌రికి వారు ఇళ్ళ‌కే ప‌రిమితమ‌యిపోయారు. దాంతో చాలా మంది సినీ కార్మికులైనా ఇక సామాన్య ప్ర‌జ‌లైనా స‌రే ఆర్ధికంగా ఎన్నో ఇబ్బందులు ప‌డుతున్నారు. ఇక దీని కోసం ఎంతో మంది టాలీవుడ్, బాలీవుడ్ హీరోలు ముందుకు వ‌చ్చి స‌హాయం చేశారు.

 

ఎవ‌రికి తోచినంత వారు విరాళాలు ఇచ్చి ఎంతో ఉదార‌త భావంతో తోటి వారికి స‌హాయం చెయ్యాల‌నే మంచి ఉద్దేశ్యంతో ముందుకు వ‌చ్చి అంద‌రూ చాలా భారీ విరాళాల‌ను ఇచ్చారు. మేము కేవ‌లం రీల్ లైఫ్‌లోనే హీరోలం కాదు రియ‌ల్ లైఫ్‌లో కూడా హీరోల‌మే అనిపించుకుంటారు వీళ్ళు. ఎప్ప‌టిక‌ప్పుడు ఏ ప్ర‌మాద‌మొచ్చినా స‌రే మేమున్నాం అంటూ ముందుకు వ‌స్తుంటారు. అయితే ఇది కేవ‌లం హీరోల‌కు మాత్ర‌మే బాధ్య‌తా వాళ్ళు మాత్ర‌మే డ‌బ్బులు సంపాదిస్తున్నారా. సినీ ఇండ‌స్ట్రీలో ఇంకెవ్వ‌రూ డ‌బ్బులు సంపాదించ‌డం లేదా.

 

కోట్లుకోట్లు బ‌డ్జెట్‌లు పెట్టి సినిమాలు నిర్మిస్తున్నారు కొంద‌రు బ‌డా నిర్మాత‌లు. మ‌రి వారికి దీంతో ఎటువంటి సంబంధం లేదా. క‌నీసం మాన‌వీయ కోణంలో కూడా వీళ్ళు ఆలోచించ‌డంలేదా. వీరికి స‌మాజం ప‌ట్ల ఎటువంటి బాధ్య‌త ఉండ‌దా. వంద‌లు, వేల కోట్లు పెట్టి సినిమాలు తియ్య‌డానికి డ‌బ్బులు ఉంటున్నాయి కానీ క‌నీసం పేద‌వాడికి ప‌ట్టెడు అన్నం పెట్ట‌డానికి మాత్రం వీరికి చేతులు రావ‌డం లేదా. ఇది కేవ‌లం మ‌న టాలీవుడ్ నిర్మాత‌లే కాదు, బాలీవుడ్, కోలీవుడ్ నిర్మాత‌ల‌ను కూడా కొంత మంది మ‌దిలో మెదిలే ప్ర‌శ్న‌లివి. మ‌రి దీనికి నిర్మాత‌లు ఎలాంటి స‌మాధానం చెబుతారో వేచి చూడాలి. 

మరింత సమాచారం తెలుసుకోండి: