ప్రపంచ దేశాల తో పాటు కరోనా వైరస్ వల్ల చిత్ర పరిశ్రమ కూడా లాక్ డౌన్ లోకి వెళ్లిపోయిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం షూటింగ్ దశలో ఉన్న సినిమాలన్ని షూటింగ్ షెడ్యూళ్లను రద్దు చేసుకున్నాయి. ఇది ఒక్క టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్, కోలీవుడ్ సహా మిగతా చిత్ర పరిశ్రమలు ఇలా షూటింగ్స్ రద్దు చేసుకున్నదే. ఇక నార్త్, అండ్ సౌత్ సినిమా ఇండస్ట్రీలోని సెలబ్రిటీలందరు పూర్తిగా ఇంటికే పరిమితమయ్యారు. దీంతో కొంతమంది సోషల్ మీడియాతో కొంతమంది కాలక్షేపం చేస్తుంటే మరికొందరు మాత్రం ఇంట్లో తమ సొంత పనులను తామే చేసుకుంటు ఆ ఫొటోలని సామాజిక మాధ్యమాలలో పెడుతూ ఫ్యాన్స్ కి టచ్ లో ఉంటున్నారు.

 

ఇక మరికొంతమంది తమలో ఉన్న ఒక్కొక్క హిడెన్ టాలెంట్ ను బయటకి తీస్తూ వాడిని వీడియోలు తీసి ఫ్యాన్స్ కి షేర్ చేస్తున్నారు. అంతేకాదు మెగాస్టార్ చిరంజీవి లాంటి సీనియర్ స్టార్స్ కూడా తాము చేస్తున్న ఇంటి పనులని పిక్స్ తీసి అభిమానులతో పంచుకుంటున్నారు. కాని సినిమాకి సంబందించిన 24 క్రాఫ్ట్స్ లలో చాలా ముఖ్యమైన మ్యూజిక్ డైరెక్టర్స్ మాత్రం తన పని తాము చేసుకుంటూ వెళుతున్నారు. రీసెంట్ గా రామ్ చరణ్ బర్త్ డే సందర్భంగా ఆర్.ఆర్.ఆర్ టీం ఒక స్పెషల్ వీడియో రిలీజ్ చేసిన సంగతి తెలిసిందే. అయితే ఈ వీడియో చేయడానికి చిత్ర బృందం చాలా కష్టపడ్డారు. ఈ వీడియో కోసం డైరెక్టర్ రాజమౌళి మ్యూజిక్ డైరెక్టర్ కీరవాణి హీరో ఎన్టీఆర్ తమిళ్ లిరిక్ రైటర్ కార్కీ లు వీడియో కాల్ ద్వారానే ఈ చరణ్ కి సంబంధించిన టీజర్ ని రెడి చేసి రిలీజ్ చేశారు.

 

జక్కన్న ని ఇన్స్పిరేషన్ గా తీసుకొని కరోనా డేస్ ని వేస్ట్ చేయకుండా ఇప్పుడు మన టాలీవుడ్ లో అందరూ ఇదే ఫాలో అవుతున్నారట. ప్రస్తుతం మ్యూజిక్ డైరెక్టర్లు అందరూ వీడియో కాల్స్ ద్వారానే మ్యూజిక్ సిట్టింగ్స్ వేస్తున్నారట. ఇప్పటికే దేవిశ్రీప్రసాద్, థమన్, గోపి సుందర్ లాంటి టాప్ మ్యూజిక్ డైరెక్టర్స్ ఇదే ఫాలో అవుతున్నారట. నిఖిల్ హీరోగా తెరకెక్కుతున్న '18 పేజెస్' సినిమా కోసం సంగీత దర్శకుడు గోపి సుందర్ వీడియో కాల్ ద్వారా మ్యూజిక్ సిట్టింగ్స్ జరుపుతున్నాడని తాజా సమాచారం. మిగతా సంగీత దర్శకులు కూడా ఇదే పద్ధతి ఫాలో అవుతున్నారట. ఏదేమైనా ఈ కరోనా టైం అందరికి కలిసి రాకపోయినా మ్యూజిక్ డైరెక్టర్స్ కి మాత్రం బాగా కలిసి వచ్చిందనే చెప్పాలి. కాని దీన్ని కూడా కొంతమంది తప్పు పడుతున్నారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: