'రౌద్రం రణం రుధిరం' ... దర్శక ధీరుడు ఎస్.ఎస్.రాజమౌళి ఎంతో ప్రతిష్ఠాత్మకంగా తెరకెక్కిస్తున్న ఈ సినిమా గురించే ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమతో పాటు యావత్ భారత దేశం ఎంతో ఆసక్తికరంగా చర్చించుకుంటోంది. అయితే ఆ చర్చలకి ఇప్పుడు అంతులేకుండా పోయాయి. అందుకు కారణం రీసెంట్ గా రామ్ చరణ్ పుట్టిన రోజు సందర్భంగా 'భీమ్ ఫర్ రామరాజు' అనే పేరుతో ఎన్టీఆర్ ఒక స్పెషల్ వీడియో విడుదల చేయడమే. ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తు ప్రేక్షకులని విపరీతంగా ఆకట్టుకుంటుంది. చాలా నెలలుగా 'సీతారామరాజు' కి సంబంధించిన ఫస్ట్ లుక్ గాని టీజర్ గాని ఎప్పుడొస్తుందో అంటూ వెయిట్ చేస్తున్న మెగా ఫ్యాన్స్ కి ఈ వీడియో మాటల్లేకుండా చేసింది. అంతగా ఈ వీడియోలో రామ్ చరణ్ ఫ్యాన్స్ తో పాటు సగటు సినీ అభిమానిని మెస్మరైజ్ చేసింది. 

 

అయితే ఇపుడు ఎన్టీఆర్ కి సంబంధించిన భీం పాత్ర ఎలా ఉండబోతుందో అన్న క్యూరియాసిటి పెరిగిపోయింది. చరణ్ చూసిన జనాలు తారక్ ని ఆకాశం అంత ఎత్తులో ఊహించుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడు టాలీవుడ్ లో ఇదే ఆసక్తికరమైన చర్చ. అయితే ఇప్పుడు ఎన్టీఆర్ వీడియోకి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ న్యూస్ బయటకి వచ్చింది. మే 20న ఎన్టీఆర్ వీడియో రానున్నదని తాజా సమాచారం. ఆ రోజు ఎన్టీఆర్ పుట్టినరోజు అన్న సంగతి అందరికి తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ కి బర్త్ డే గిఫ్ట్ గా రామ్ చరణ్ కూడా ఒక స్పెషల్ వీడియో రెడీ చేపిస్తున్నాడని లేటెస్ట్ న్యూస్. తారక్ చరణ్ టీజర్ కి ఇచ్చిన వాయిస్ ఓవర్ ఇప్పుడు టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో హాట్ టాపిక్ అవుతోంది. అందుకు కారణం తారక్ హిందీలోను వాయిస్ ఇచ్చాడు.

 

ఇక చరణ్ వీడియో కోసం వెయిట్ చేసినట్టే తారక్ స్పెషల్ వీడియో కోసం మే 20 వరకు ఫ్యాన్స్ వెయిట్ చేయాల్సిందే. మొత్తానికి 'రౌద్రం రణం రుధిరం' సినిమాతో తారక్ చరణ్ చేయబోయో రణం ఎలా ఉంటుందో ఇప్పటికే ఒక అంచనాకి వచ్చేశారు అటు తారక్ ఫ్యాన్స్ ఇటు చరణ్ ఫ్యాన్స్. చరణ్ రామరాజు టీజర్ రిలీజైనప్పటి నుంచి ప్రభాస్ మాదిరిగానే చరణ్ తారక్ లను రాజమౌళి పాన్ ఇండియా స్టార్స్ గా మార్చబోతున్నారని ఇప్పటికే నార్త్ సౌత్ సినిమా ఇండస్ట్రీలలో చెప్పుకుంటున్నారు. అంతేకాదు ఇప్పుడే తారక్, చరణ్ ల "రౌద్రం రణం రుధిరం" ... "రణం" మొదలైంది ...ఇది ఆపడం ఎవరితరం కాదు ..అంటూ ఫ్యాన్స్ చెప్పుకుంటున్నారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: