టాలీవుడ్ లో స్పీడ్ గా సినిమాలు రిలీజ్ చేయడమే కాదు అంతే స్పీడ్ గా సినిమాలకి సైన్ చేసే హీరో కూడా నానినే. ఖచ్చితంగా సంవత్సరానికి మూడు సినిమాలు విడుదల చేసే హీరోలలో నేచురల్ స్టార్ కూడా ఉంటాడు. అంతేకాదు హిట్ ఫ్లాప్స్ ని పట్టించుకోకుండా వరుసగా సినిమాలు చేసుకుంటూ వెళ్ళడం నాని మొదటి నుంచి బాగా అలవాటు. ఫ్లాప్ వస్తే కృంగిపోయి ఇంట్లో కూర్చొని మదనపడేరకం నాని కాదు. ఈ విషయం అందరూ అంటుంటారు. సాధారణంగా మన టాలీవుడ్ లో కొంతమంది హీరోలు వరుసగా రెండు ఫ్లాప్స్ పడ్డాయంటే అంతే ఇక కొన్ని నెలలు గ్యాప్ తీసుకొని మళ్ళీ కథలు విని సినిమా ఓకే చేసి సెట్స్ మీదకి వెళుతుంటారు. కానీ నని ఎప్పుడూ షూటింగ్స్, స్టోరీ డిస్కషన్స్ తో బిజీగా ఉండటానికి ప్రయత్నిస్తూ ఉంటాడు. 

 

అయితే నాని ప్రస్తుతం కరోనా వైరస్ కారణంగా సినిమా షూటింగ్స్ కి బ్రేక్ చెప్పి లాక్ డౌన్ లో భాగంగా అందరిలాగానే నాని కూడా ఇంట్లో ఉంటున్నాడు. ఫ్యామిలీకి కావాల్సినంత టైమ్ కేటాయించే నాని ఇప్పుడు ఇంటికే పరిమితమై ఫ్యామిలీతో కావలసిన సినిమాలతో కాలక్షేపం చేస్తున్నాడట. త్వరలోనే నాని నటించిన 'వి' సినిమా ఈ నెలలో రిలీజ్ కి రెడీ అయింది. ఇక కరోనా వ్యాప్తితో నెక్స్ట్ సినిమాకి బ్రేక్ ఇచ్చిన నాని ఇంతకాలం చూడకుండా మిస్సయిన సినిమాలన్నిటిని వరుసగా చూడటానికి రెడీ అయ్యాడు.

 

వాస్తవంగా నాని సినిమా పిచ్చోడు. అంటే సినిమాలంటే విపరీతమైన పిచ్చి అని. ఏమాత్రం కాస్త ఖాళీ సమయం దొరికిన సినిమా చూడటానికి రెడీ అవుతాడు. షూటింగ్స్ కారణంగా ఇప్పటివరకు చాలా సినిమాలను మిస్సైపోయాడట. ఇప్పుడు ఆ సినిమాలన్నిటిని ఇంట్లో కూర్చొని చూడటానికి టైమ్ దొరికింది అంటూ ఫ్యామిలీతో కలిసి నచ్చిన సినిమాలు, వెబ్ సిరీస్ లు, షోలు వరుసబెట్టి చూసేద్దామని ఒక లిస్ట్ రాసుకున్నాడట. తెలుగుతో పాటు మిగతా భాషల్లో ఫ్లాప్ అయినా సినిమాలు కూడా చూడాలని షెడ్యూల్స్ వేసుకున్నాడట. అయితే అలా చూసిన వాటిల్లో ఏదైనా సినిమా థీం నచ్చితే ఆ సినిమా రీమేక్ చేసే ప్లాన్స్ కూడా ఉన్నాయట. ఇది కదా నేచురల్ స్టార్ అంటే. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


 
NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

https://tinyurl.com/NIHWNgoogle

 

https://tinyurl.com/NIHWNapple

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: